PM Kisan Scheme Update: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్ రాబోతుంది. 13వ విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. మరో రెండు రోజుల్లో కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమకానున్నాయి. ప్రధాని మోదీ ఈ నెల 24న నగదును బదిలీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు 12 విడతల్లో డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24 నాటికి ఈ పథకం ప్రారంభించి సంవత్సరాలు పూర్తవుతోంది. దీంతో అదేరోజున ప్రభుత్వం రైతుల ఖాతాలో నగదు జమ చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిన్న, సన్నకారు రైతుల కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1న మధ్యంతర కేంద్ర బడ్జెట్‌ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ పథకాన్ని ప్రకటించారు. 2019 ఫిబ్రవరి 24 నుంచి ఈ పథకం అమలులో ఉండగా.. రైతుల బ్యాంకు ఖాతాకు నేరుగా నగదు జమ అవుతుంది. ఏడాదికి మూడు వాయిదాల చొప్పున రూ.6 వేలను జమ చేస్తోంది. 2022లో పీఎం కిసాన్ యోజన లబ్ధిదారుల సంఖ్య 10.45 కోట్లకు చేరుకుందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. ఈ ఏడాది దాదాపు 12 కోట్ల మంది రైతులు లబ్ధిపొందనున్నారు.


ఇప్పటివరకు ఈ-కేవైసీ పూర్తి చేయని రైతుల ఖాతాలకు డబ్బులు బదిలీ చేయమని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మీరు ఇంకా కేవైసీ పూర్తి చేయకుంటే మీ ఖాతాలోకి డబ్బు రాదు. 
 
ఈ-కేవైసీ ఇలా చేసుకోండి..


==>> పీఎం కిసాన్ యోజన pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
==>> వెబ్‌సైట్‌లో కుడి వైపున ఉన్న E-KYC ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
==>> ఇప్పుడు మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
==>> ఈ ఓటీపీ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన తర్వాత.. అందులో ఎంటర్ చేయండి.
==>> ఆ తరువాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
==>> ఇప్పుడు మీ E-KYC పూర్తవుతుంది.
 
ఈ పథకానికి సంబంధించి మీకు ఏదైనా సమస్య తలెత్తితే హెల్ప్‌లైన్ నెంబర్ 155261 లేదా 1800115526 లేదా 011-23381092కు సంప్రదించాలి. అది కాకుండా pmkisan-ict@gov.in కు మెయిల్ చేయాల్సి ఉంటుంది.


Also Read: YS Sharmila: తెలంగాణలో హిజ్రాలు ఆందోళన.. వైఎస్ షర్మిల క్షమాపణలు   


Also Read: YSR Law Nestham Scheme: ఏపీలో వారికి గుడ్‌న్యూస్.. అకౌంట్‌లోకి డబ్బులు జమ.. చెక్ చేసుకోండి  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి