PM Kisan Yojana Latest Update: ప్రస్తుతం దేశంలో అత్యధిక మంది రైతులు లబ్ధి పొందుతున్న పథకం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం కింద 9 కోట్ల మంది అన్నదాతలకు ఉపయోగపడుతోంది. ఈ స్కీమ్‌ కింద లబ్ధిదారులకు ఏడాదికి రూ.6 వేలను అందజేస్తోంది కేంద్ర ప్రభుత్వం. రూ.2 వేల చొప్పున మూడు వాయిదాల్లో నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తోంది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేలను పొందుతున్నారు రైతులు. ఇప్పటివరకు 13 విడతల్లో నగదు జమ అవ్వగా.. త్వరలో 14 విడతకు సంబంధించి డబ్బులు జమకానున్నాయి. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ యోజన పథకంపై ఓ ప్రచారం తెరపైకి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భార్యాభర్తలు ఇద్దరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం వర్తిస్తుందంటూ కొందరు ప్రచారం చేసున్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఒక రైతు కుటుంబంలో ఒకరికే ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. భార్యాభర్తలు ఇద్దరికీ వేర్వేరు పాస్‌ పుస్తకాలు ఉన్నా.. లబ్ధి ఒక్కరికే చేకూరుతుందని పేర్కొంది. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని సూచించింది. 


పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే రైతులు భూ రికార్డులను సరిచూసుకోవాలి. కచ్చితంగా ఈ కేవైసీని ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలి. ఆ తరువాత రైతులు పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తమ పేరును నమోదు చేసుకోవాలి. మీరు ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలనుకుంటే.. మీరు సమర్పించిన బ్యాంక్ అకౌంట్, ఆధార్ నంబర్ చెక్ చేసుకోండి. మీరు ఇంకా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయకపోతే.. వెంటనే చేసుకోండి. కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారుల ఖాతాల్లో నగదు బదిలీ జరగదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.


Also Read: CNG PNG New Price: బిగ్‌ రిలీఫ్.. గ్యాస్‌ ధరలు తగ్గింపు.. నేటి నుంచే అమలు  


ఈ కేవైసీ ఇలా పూర్తి చేసుకోండి..


==> పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి అధికారిక వెబ్‌సైట్‌ pmkisan.gov.in లోకి లాగిన్ అవ్వండి.
==> వెబ్‌సైట్‌లో రైట్ సైడ్  ఉన్న ఈ-కేవైసీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
==> మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
==> తరువాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. 
==> ఆ తరువాత సబ్మిట్ క్లిక్ చేయండి.
==> మీ ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయినట్లు డిస్‌ ప్లే అవుతుంది. 


గమనిక: పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎలాంటి సమాచారం కావాలని pmkisan-ict@gov.in కు మెయిల్ చేయవచ్చు. హెల్ప్‌లైన్ నంబర్ల- 155261, 1800115526 (టోల్ ఫ్రీ), 011-23381092.


Also Read: IPL 2023 Updates: ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు డకౌట్‌ అయిన ఆటగాళ్లు వీళ్లే..   


Also Read: Bandi Sanjay Comments: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ సన్మానం.. శాలువా తీసుకువస్తే చివరికి..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి