BJP Strategy: కేంద్రంలో బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందా..? వచ్చే ఎన్నికల్లో కమలనాథుల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి..? దక్షిణాదిలో ఆ పార్టీ పుంజుకుంటుందా..? ప్రధాని అభ్యర్థిగా మోదీయే ఉంటారా..? రాజకీయ విశ్లేషకులు ఏం చెబుతున్నారు..? ఢిల్లీలో తాజాగా రాజకీయ పరిణామాలపై ప్రత్యేక కథనం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ఆ దిశగా పావులు కదుపుతోంది. సంక్షేమ పథకాలే అస్త్రంగా ప్రజల్లోకి వెళ్లాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. ఈ రెండేళ్లలో ప్రజా వ్యతిరేత లేకుండా పాలన సాగించాలని ఇటు ప్రధాని మోదీ సైతం భావిస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం..2019లోనూ సత్తా చాటి వరుసగా రెండోసారి పవర్‌లోకి వచ్చింది. 2024లోనూ గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని కమలనాథులు స్కెచ్‌లు వేస్తున్నారు.


నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రెండో స్థానంలో ఉన్న రాష్ట్రాలపై కూడా ఫోకస్‌ చేశారు. ప్రధానంగా దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల హవా ఉంది. దానిని అధికమించి అతిపెద్ద జాతీయ పార్టీగా ఆవిర్భావించాలని ఇటీవల పార్టీ శ్రేణులకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు. ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేతలు సమావేశం కూడా జరిగింది.


తెలంగాణ, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని బీజేపీ నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ, కర్ణాటకలో పుంజుకోవాలని యోచిస్తున్నారు.ఈక్రమంలోనే ఆ రెండు రాష్ట్రాల్లో ఇటీవల పార్టీ పెద్దల పర్యటనలు కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని భారీ బహిరంగ సభలు ఉండనున్నాయి. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ..ఆయా రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.


దక్షిణాదిలో ఎంపీ స్థానాలను పెంచుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. 2014లో 545 పార్లమెంట్ స్థానాలకు గాను బీజేపీ 282 సీట్లను గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ 44 స్థానాలకే పరిమితమైంది. ఎన్డీయేలో ఇతర పార్టీల సపోర్ట్ లేకుండా సొంతంగా అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. 2019 ఎన్నికల్లోనూ కమలనాథుల హవా మరింత పెరిగింది. గతంలో వచ్చిన స్థానాల కంటే 21 సీట్లను అధికంగా తెచ్చుకుంది.


మొత్తంగా 303 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అదే ఊపుతో మూడోసారి అధికారంలోకి రావాలని ప్రధాని మోదీతోపాటు ఇతర నేతలు యోచిస్తున్నారు. ఆ దిశగా వ్యూహాలకు పదును పెట్టారు. రానున్న రెండేళ్ల పాలనలో మరిన్ని అద్భుతాలు చేస్తామని..అవే తమను గెలిపిస్తాయని అంటున్నారు. మరి కమలనాథుల వ్యూహాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.


Also read: APP vs BJP: ఆప్ చేతిలో బీజేపీ సీఎం స్కాం చిట్టా! దేశంలో పెను సంచలనమేనా.. ?


Also read:Achyuthapuram Gas Leakage: అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి గ్యాస్ లీకేజీ కలకలం... తప్పిన ముప్పు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


 


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook