BJP Focus On Telangana: కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేసేలా బీజేపీ స్కెచ్! తెలంగాణలో ఇక రణరంగమేనా?

BJP Focus On Telangana: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ పూర్తి స్థాయిలో ఫోకస్ చేసిందా? అధికారం సాధించే వరకు కమలం ఆపరేషన్ కొనసాగుతుందా? అంతే తాజాగా బీజేపీలో జరుగుతున్న పరిణామాలతో అవునని చెప్పక తప్పదు. నెల రోజుల్లోనే ముగ్గురు అగ్రనేతలు తెలంగాణలో పర్యటించారంటే బీజేపీ రాష్ట్రంపై ఎంతగా ఫోకస్ చేసిందో అర్ధమవుతోంది.

Written by - Srisailam | Last Updated : Jun 3, 2022, 02:10 PM IST
  • నెల రోజుల్లో ముగ్గురు అగ్రనేతల టూర్
  • హైదరాబాద్ లోనే జాతీయ కార్యవర్గ సమావేశాలు
  • తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్
 BJP Focus On Telangana: కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేసేలా బీజేపీ స్కెచ్! తెలంగాణలో ఇక రణరంగమేనా?

BJP Focus On Telangana: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ పూర్తి స్థాయిలో ఫోకస్ చేసిందా? అధికారం సాధించే వరకు కమలం ఆపరేషన్ కొనసాగుతుందా? అంతే తాజాగా బీజేపీలో జరుగుతున్న పరిణామాలతో అవునని చెప్పక తప్పదు. జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. బీజేపీకి టాప్ ముగ్గురు నేతలు వీళ్లే. ఈ ముగ్గురు అగ్ర నేతలు నెల రోజుల్లోనే తెలంగాణలో పర్యటించారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మే5న పాలమూరులో నిర్వహించిన సభలో జేపీ నడ్డా పాల్గొన్నారు. మే 14న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన సంజయ్ పాదయాత్ర ముగింపు సభకు అమిత్ షా హాజరయ్యారు. ఇక మే 26న ఐఎస్ బీ వార్షికోత్సవానికి అధికారిక పర్యటనలో వచ్చిన ప్రధాని మోడీ... షెడ్యూల్ లో లేకున్నా బేగంపేట ఎయిర్ పోర్టు దగ్గర బీజేపీ సభలో పాల్గొన్నారు. ముగ్గురు అగ్ర నేతలు తమ ప్రసంగాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఖాయమని జోస్యం చెప్పారు.

నెల రోజుల్లోనే ముగ్గురు అగ్రనేతలు తెలంగాణలో పర్యటించారంటే బీజేపీ రాష్ట్రంపై ఎంతగా ఫోకస్ చేసిందో అర్ధమవుతోంది. జాతీయ నేతలే కాదు బీజేపీ ముఖ్యమంత్రులు తెలంగాణకు క్యూ కడుతున్నారు. అంతేకాదు గత ఎనిమిది ఏళ్లుగా లేనిది ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించింది బీజేపీ. కేంద్రం సాంస్కృతిక శాఖ నిర్వహించిన తెలంగాణ ఉత్సవానికి ఏకంగా అమిత్ షా హాజరయ్యారు. కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణకు సంబంధించి ఓ చిన్న అవకాశం వచ్చినా ఉపయోగించుకుంటోంది కమల దళం. తెలంగాణకు చెందిన బీసీ నేత లక్ష్మణ్ ను యూపీ నుంచి రాజ్యసభకు పంపించింది. తెలంగాణ ఆపరేషన్ లో భాగంగానే ఈసారి పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను కూడా హైదరాబాద్ లోనే నిర్వహించబోతోంది. జూలై 2,3 తేదీల్లో జరగనున్న సమావేశాలకు బీజేపీ నేతలంతా హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు రెండో రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండనున్నారు. కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 300 మందికిపైగా కీలక నేతలు హైదరాబాద్ సమావేశాలకు హాజరుకానున్నారు.

దక్షిణాదిపై ఎప్పటినుంచో పోకస్ చేసింది బీజేపీ. కాని ఆశించిన ఫలితాలు సాధించలేదు. దక్షిణాదికి సంబంధించి కర్ణాటకలో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. అది కూడా బోటాబోటీ మెజార్టీతోనే. వచ్చే ఏడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కేరళ, తమిళనాడులో బీజేపీ బలపడలేదు. ఏపీలో పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. దీంతో బీజేపీ ఆశలన్ని తెలంగాణ రాష్ట్రంపైనే ఉన్నాయి. అందుకే అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలుస్తోంది.తెలంగాణలో చీమచిటుక్కుమన్నా బీజేపీ పెద్దలు వాలిపోతున్నారు. కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేసేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టడం లేదు. జీవో 317, కరీంనగర్‌లో బండి సంజయ్ అరెస్ట్ , ఖమ్మంలో సాయిగణేష్‌ సూసైడ్ ఘటనపై బీజేపీ పెద్దలు సీరియస్ గా స్పందించారు.  

కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చినప్పటి నుంచే తెలంగాణపై బీజేపీ దృష్టి సారించింది. కాని అనుకున్న లక్ష్యం సాధించలేదు. సరికదా 2014తో పోలిస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మరింత పతనమైంది. 2014లో బీజేపీకి ఐదుగురు ఎమ్మెల్యు ఉండగా.. 2018లో రాజాసింగ్ ఒక్కరే గెలిచారు. అయితే 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మాత్రం కారు పార్టీని కంగారు పెట్టింది కమలదళం. నాలుగు లోక్ సభ సీట్లు కైవసం చేసుకుంది. అప్పటి నుంచే మరింత దూకుడు పెంచింది బీజేపీ హైకమాండ్. దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు బీజేపీకి మరింత బూస్ట్ ఇచ్చింది. తర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెమటలు పట్టించింది. హుజురాబాద్ ఉప ఎన్నికలోనూ కేసీఆర్ కు దిమ్మతిరిగే షాకిచ్చింది. ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా... హుజురాబాద్ లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. దుబ్బాక, హుజూర్ నగర్ విజయాలతో తెలంగాణలో అధికారం సాధిస్తామనే ధీమాకు కమలం పార్టీ పెద్దలు వచ్చారని అంటున్నారు. అందుకే ఏది ఏమైనా అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

తెలంగాణపై బీజేపీకి ఆశలు పెరగడానికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఇటీవల కాలంలో అది పీక్ స్జేజీకి చేరిందని తెలుస్తోంది. బీజేపీ హైకమాండ్ జరిపించిన సర్వేల్లోనే కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తేలిందట. అందుకే  ఇదే సరైన సమయమని భావిస్తున్న బీజేపీ.. అన్ని అస్త్రాలను ఉపయోగిస్తోందని, పక్కా స్కెట్ తో వర్కవుట్ చేస్తుందని చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. పీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డికి ఇచ్చాకా ఆ పార్టీ కేడర్ లో జోష్ కనిపిస్తోంది. అయితే వర్గపోరు ఆ పార్టీకి శాపంగా మారుతోంది. అందుకే టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెబుతున్న బీజేపీ.. ఈసారి ఎలాగైనా అధికారం సాధించాలనే కసితో పని చేస్తోంది. జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత తెలంగాణలో బీజేపీ రాజకీయం మరింత దూకుడుగా ఉంటుందని.. బెంగాల్ తరహా పరిణామాలు కనిపిస్తాయని అంటున్నారు. మొత్తంగా తెలంగాణలో రాబోయో రోజుల్లో రాజకీయ రణరంగం తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

READ ALSO: Revanth Reddy: కేసీఆర్ కుటుంబాన్ని జైళ్లో వేసి తీరుతా... అమెరికాలో రేవంత్ రెడ్డి శపథం!

READ ALSO: MLA RAJASINGH ON CONGRESS: కాంగ్రెస్‌ నాయకులను చూసి జనం నవ్వుకుంటున్నారు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News