Narendra Modi Rally: దేశంలోని అన్ని సమస్యలకు మూలం.. 'సమస్యలకు తల్లి కాంగ్రెస్‌ పార్టీ' అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మతపరంగా దేశాన్ని విడగొట్టినది ఎవరు? అని ప్రశ్నించారు. కశ్మీర్‌, నక్సలిజానికి బాధ్యులెవరు అని నిలదీశారు. 'అయోధ్య రామమందిర నిర్మాణాన్ని ఎవరు వ్యతిరేకించారు. ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని ఎవరు నిరాకరించారు' అని ప్రశ్నల వర్షం కురిపించారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Shobha Karandlaje: ప్రచారంలో అపశ్రుతి.. కేంద్ర మంత్రి కారు తగిలి కార్యకర్త మృతి


'కాకరకాయ రుచి ఎప్పుడూ మారదు. చక్కెర వేసినా.. నెయ్యి కలిపినా కాకరకాయ రుచి మారనట్టు.. కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి కూడా అంతే' అని ప్రధాని ఎద్దేవా చేశారు. పదేళ్ల కిందట కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోల్పోవడంతో దేశంలోని అన్ని సమస్యల పరిష్కారం సాధ్యమైంది. నక్సలిజం సమస్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఉగ్రవాదాన్ని కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు రాజకీయంగా మలుచుకుంది. వారి మేనిఫెస్టో చూస్తే ముస్లిం లీగ్‌కు అచ్చుగుద్దినట్టు ఉంది' అని తెలిపారు.

Also Read: KCR Arrest: కేసీఆర్‌ జైలుకు వెళ్లడం ఖాయమా? రేవంత్‌ రెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ ఇదేనా?


 


ఈ ఎన్నికలు అనేవి సుస్థిరత.. అస్థిరత మధ్య జరుగుతున్నాయి. దేశం కోసం ధృడమైన, అతిపెద్ద నిర్ణయాలు తీసుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్క బీజేపీనే. మరోవైపు ఇండియా కూటమి ఎక్కడ అధికారం వస్తే అక్కడ లబ్ధి పొందాలనే చూసేది కాంగ్రెస్‌ పార్టీ' అని ఆరోపించారు. మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాలు కేంద్ర కొత్త ప్రభుత్వం ఏర్పాటులో కీలక భాగం కానుంది. ఇక్కడ ఐదు దశల్లో లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈసారి అత్యధిక స్థానాలు సొంతం చేసుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. మరాఠా గడ్డను చేజిక్కించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook