న్యూఢిల్లీ: కరోనా(COVID-19) మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భారత్ అమెరికాతో కలిసి పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తాము వివిధ అంశాలపై విస్తృతమైన టెలిఫోన్ సంభాషణలు జరుపుతున్నామని, COVID-19 తో పోరాడటానికి భారత-యుఎస్ భాగస్వామ్యం, ఆవశ్యకతపై చర్చించామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


భారతదేశంలో కరోనాను వ్యాప్తి నియంత్రణకు దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ విధించబడిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 11 లక్షలకు పైగా పెరిగాయి. ఈ నేపథ్యంలో దేశాలు షట్ డౌన్ ప్రకటించాయి. అమెరికా, స్పెయిన్, ఇటలీ, ఇతర దేశాలలో COVID-19 కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కరోనాతో అంతర్జాయతీయంగా వ్యాపారాలు, విమానాశ్రయాల షట్డౌన్ కారణంగా మార్కెట్లు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. 


Read also : కరోనావైరస్‌ను ఓడించిన 93 ఏళ్ల వృద్ధ దంపతులు
జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ ట్రాకర్ ఆధారం ప్రకారం ఈ వారంలో అమెరికా 1,169 COVID-19 మరణాలు నమోదయ్యాయని తెలిపింది. క్రమంగా అమెరికాలో రోజుకు సగటున 15 వేలకు పైగానే పెరుగుతున్నాయని ట్రాకర్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులలో నాలుగింట ఒక వంతు యుఎస్ లో నమోదవుతున్నాయని, ఐరోపాలోఇప్పటివరకు 40,000 మంది కరోనా బారిన పడి మరణించారని, స్పెయిన్‌లో గత 48 గంటల్లో 900 మందికి పైగా మరణాలు సంభవించాయని ట్రాకర్ పేర్కొంది. 


 


Read also : హమ్మయ్య.. ఆ సింగర్‌కి ఆరోసారికి కరోనా నెగటివ్ ఫలితం


సంపన్న దేశాలు కరోనా భారాన్ని భరిస్తున్నాయని, కాని సిరియా, లిబియా, యెమెన్ వంటి దేశాలను ప్రస్తావిస్తూ యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అక్కడ పరిస్థితి మరింత దిగజారిపోతోందని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కరోనా మహమ్మారి క్షీణింపజేస్తోందని, మార్చిలో అమెరికా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని ఓ అధికారి తెలిపారు. హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..