PM Modi: దేశంలో మోదీ మేనియా.. తన రికార్డు తానే బద్దలు కొట్టిన నరేంద్రుడు.. అస్సలు ఊహించి ఉండరు..
PM Modi speech: దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఊరువాడ, పల్లెపట్నం అని తేడాలేకుండా ప్రతి చోట్ల కూడా జాతీయ జెండాలను ఎగుర వేశారు. మనదేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులను గుర్తు చేసుకుని నివాళులు అర్పించారు.
PM modi gave the longest speech of 98 minutes on 78th Independence day: మోదీ దేశంలో హ్యాట్రిక్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో.. ఆయన అనేక సంచలనాత్మక నిర్ణయాలను తీసుకుంటూ,పాలనతో తనదైన మార్కు చూపిస్తున్నారు. ఈ రోజు దేశ వ్యాప్తంగా ఇండిపెండెన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. మోదీ 11 వ సారి ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతేకాకుండా.. గత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పైన ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. ఇదిలా ఉండగా..ప్రధాని మరో అరుదైన రికార్డును ప్రస్తుతం సాధించారు.
ప్రధాని ఆహార్యం, వస్త్రాధారణ అంతా కూడా అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ రోజు ఆయన వేసుకున్న తలపాగ కూడా ప్రత్యేకఆకర్శణగా నిలిచింది. మరోవైపు.. ప్రధాని మోదీ ధరించిన తలపాగా నారింజ, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంది. తలపాగాకు ఉన్న పొడవాటి దారం కూడా మూడు రంగుల కలయికలోనే ఉంది. రాజస్థాన్‌కు చెందిన సాంప్రదాయ టెక్స్‌టైల్ టెక్నిక్‌తో దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది.
ఈ లెహెరియా డిజైన్‌ను థార్ ఎడారిలో కనిపించే ‘నేచురల్ వేవ్’ నమూనా ప్రకారం తయారు చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా మోదీ జాతీయ పతావిష్కరణ అనంతరం.. ఏకంగా 98 నిమిషాల పాటు ప్రసంగించి అరుదైన ఘనత సాధించారు. గతంలో ఆయన పేరిటే ఉన్న మునుపటి 94 రికార్డును ఆయన బద్దలు కొట్టారు.
2014 నుంచి 2024 వరకు ఎర్రకోటపై మోదీ ప్రసంగాల వివరాలు..
1. 2014 - 65 నిమిషాలు
2. 2015 - 85 నిమిషాలు
3. 2016 - 94 నిమిషాలు
4. 2017 - 56 నిమిషాలు
5. 2018 - 83 నిమిషాలు
6. 2019 - 92 నిమిషాలు
7. 2020 - 86 నిమిషాలు
8. 2021 - 88 నిమిషాలు
9. 2022 - 83 నిమిషాలు
10. 2023 - 90 నిమిషాలు.
మోదీ కంటే ముందు 1947లో జవహర్‌లాల్ నెహ్రూ 72 నిమిషాలు ప్రసంగించారు. 1997లో ఐకే గుజ్రాల్ 71 నిమిషాలపాటు సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. ఇక తక్కువ సమయం ప్రసంగాల విషయానికి వస్తే జవహర్ లాల్ నెహ్రూ 1954, 1966లలో 14 నిమిషాలు మాత్రమే మాట్లాడినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter