న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోన్న కరోనావైరస్ మహమ్మారి భారత్ లో కూడా వ్యాప్తి తీవ్రతరమవుతోంది. కాగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ 9 వ రోజు అమలవుతున్న నేపథ్యంలో మరిన్ని పటిష్టమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నేడు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రాల సరిహద్దుల్లో పటిష్టమైన తనిఖీలు నిర్వహించాలని, లాక్ డౌన్ గడువు ముగిసిన తరవాత పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  గంభీర్, యువీ పోరాటం.. ధోనీ ఫినిషింగ్.. అద్భుతమైన క్షణాలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read Also: సెక్సీ ఫిగర్‌తో సెగలు రేపుతోన్న భామ


మరోవైపు రైతులకు పంట కోత సమయం దగ్గరపడనుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తమవ్వాలని, కరోనావైరస్ వ్యాప్తి దృష్ట్యా వారికి అవగాహన కల్పించాలని, వలసదారుల కదలిక, నిత్యావసరాల లభ్యత, తబ్లిఘి జమాతే అంశానికి సంబంధించి కాంటాక్ట్ ట్రేసింగ్ వంటి సమస్యలపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. 


Also Read:  మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. వెండి పరుగులు     


కరోనావైరస్ వ్యాప్తి తరువాత  రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది రెండోసారి కాగా, 21 రోజుల లాక్డౌన్ అమల్లోకి వచ్చిన తరువాత మొదటిసారి. కాగా ఈ సమావేశంలోప్రధానితో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..