PM Modi Meets President Ramnath Kovind: పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి ఎదురైన చేదు అనుభవం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఫిరోజ్‌పూర్ వెళ్లే మార్గంలో ఓ ఫ్లైఓవర్‌పై సుమారు 20 నిమిషాల పాటు ప్రధాని కాన్వాయ్ చిక్కుకుపోవడం... ఆపై ప్రధాని అక్కడి నుంచి వెనుదిరగడం తెలిసిందే. ఈ ఘటనపై అటు కేంద్రం, ఇటు పంజాబ్ సర్కార్..  మీదంటే మీదే నిర్లక్ష్యమని 'బ్లేమ్ గేమ్' మొదలుపెట్టాయి. తాజాగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన ప్రధాని మోదీ నిన్నటి ఘటనను ఆయనకు వివరించారు. ఘటనపై రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భద్రతా వైఫల్యం వల్లే ఆ ఘటన చోటు చేసుకుందని ప్రధాని మోదీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో చెప్పినట్లు తెలుస్తోంది. భద్రతా ఏర్పాట్లలో పంజాబ్ ప్రభుత్వం, అక్కడి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, ప్రధాని పర్యటనలో అసలు ఎలాంటి భద్రతా వైఫల్యం లేదని పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ పేర్కొన్నారు. ఒకవేళ భద్రతా వైఫల్యమే గనుక ఉంటే ఎస్పీజీ బలగాలు ఐదు రోజులుగా ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. ఇది కేవలం పంజాబ్ ప్రభుత్వాన్ని, పంజాబ్ వాసులను బద్నాం చేసే ప్రయత్నమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ప్రధాని పంజాబ్ పర్యటనలో భాగంగా ఫిరోజ్‌పూర్‌లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. మొదట భటిండా ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన.. అక్కడినుంచి రోడ్డు మార్గంలో ఫిరోజ్‌పూర్ బయలుదేరారు. అయితే స్థానిక రైతుల నిరసనతో ఓ ఫ్లైఓవర్‌పై ప్రధాని కాన్వాయ్ ఆగిపోయింది. దీంతో సుమారు 20 నిమిషాల పాటు ప్రధాని అక్కడే చిక్కుకుపోయారు. రైతులు అక్కడి నుంచి కదిలే పరిస్థితి లేకపోవడంతో చేసేది లేక ప్రధాని వెనుదిరిగారు. ప్రధాని పర్యటన ఉందని తెలిసి కూడా పంజాబ్ ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లలో నిర్లక్ష్యంగా వహించిందని కేంద్రం ఆరోపిస్తోంది.


మరోవైపు పంజాబ్ ప్రభుత్వం మాత్రం తమవైపు నుంచి ఎలాంటి నిర్లక్ష్యం, లోపం జరగలేదని చెబుతోంది. నిజానికి వాయు మార్గంలో ఫిరోజ్‌పూర్ వెళ్లాల్సిన మోదీ... చివరి నిమిషంలో రోడ్డు మార్గంలో బయలుదేరడం వల్లే ఈ ఘటన (PM Modi Security Breach) చోటు చేసుకుందని సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ పేర్కొన్నారు. రాజకీయ కారణాలతోనే బీజేపీ.. పంజాబ్ ప్రభుత్వాన్ని నిందిస్తోందని మండిపడ్డారు. ఈ ఘటనపై సీఎం చన్నీ అత్యున్నత స్థాయి కమిటీతో విచారణకు ఆదేశించారు.


Also Read: సభ్య సమాజం సిగ్గుపడే ఘటన.. వనమా రాఘవకు కేసీఆర్ అండదండలు..: పాల్వంచ ఘటనపై రేవంత్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook