PM Kisan 17th Installment: పీఎం కిసాన్ 17వ వాయిదా విడుదల, మీ ఎక్కౌంట్లో పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి
PM Kisan 17th Installment: అన్నదాతలకు శుభవార్త. దేశవ్యాప్తంగా రైతన్నల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం మరోసారి డబ్బులు జమ చేసింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పధకంల 17వ విడత వాయిదా మీ ఎక్కౌంట్లో పడిందో లేదో చెక్ చేసుకోండి.
PM Kisan 17th Installment: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పధకంలో భాగంగా దేశంలోని రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంటుంది. వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ రైతుల ఎక్కౌంట్లలో డబ్బులు బదిలీ చేశారు. మీ ఎక్కౌంట్లో ఆ డబ్బులు వచ్చాయో లేదో చెక్ చేసుకోండి
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పధకం. అన్నదాతల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ పధకంలో భాగంగా డబ్బులు జమ చేస్తుంటుంది. అన్నదాతల సహాయార్ధం ప్రతి నాలుగు నెలలకోసారి 2 వేల చొప్పున ఏడాదికి 6 వేల రూపాయలు జమ చేస్తుంటుంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తరువాత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పధకంలో భాగంగా 17వ విడత వాయిదాను విడుదల చేసింది. నిన్న జూన్ 18వ తేదీన వారణాసి నుంచి 9.26 కోట్లమంది లబ్దిదారులకు 20 వేల కోట్ల రూపాయల్ని విడుదల చేశారు. ఇంతకుముందు ఫిబ్రవరిలో 16వ విడతలో భాగంగా 2 వేలు విడుదలయ్యాయి. ఇప్పుడు 17వ విడత మరో 2 వేల రూపాయలు బదిలీ అయ్యాయి.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభమైనప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 11 కోట్లమంది రైతులకు 3.04 లక్షల కోట్లు అందాయి. 2019లో ప్రారంభమైన ఈ పధకం కింద రైతులకు నేరుగా వారి ఖాతాల్లోకే 2 వేల రూపాయలు డబ్బులు అందుతున్నాయి. ఏడాదికి 6 వేల రూపాయలు మూడు వాయిదాల్లో చెల్లిస్తుంటారు. గత ఏడాది నవంబర్ నెలలో 15వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు విడుదల కాగా ఫిబ్రవరిలో 16వ వాయిదా డబ్బులు జమ అయ్యాయి.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పధకం ప్రయోజనాలు అందాలంటే ఈ కేవైసీ తప్పనిసరి. ఇ కేవైసీ చేయించుకోని రైతులకు డబ్బులు జమ కావు. ఈపధకంలో రిజిస్టర్ అయిన రైతులు తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవల్సిందే. ఇది ఓటీపీ ఆధారిత కేవైసీ. పీఎం కిసాన్ పోర్టల్ సందర్శించి చాలా సులభంగా ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు.
ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్ సందర్శించాలి. కుడి చేతివైపుండే నో యువర్ స్టేటస్ క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్ నెంబర్ , క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. గెట్ డేటా ఆప్షన్ ఎంచుకోవాలి. మీ స్టేటస్ స్క్రీన్‌పై కన్పిస్తుంది. జాబితాలో మీ పేరుందో లేదో కూడా ఇదే వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్ ఓపెన్ చేశాక బెనిఫిషియరీ లిస్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం ఎంచుకోవాలి. గెట్ రిపోర్ట్ డేటా క్లిక్ చేస్తే జాబితాలో మీ పేరుంటే కన్పిస్తుంది. ఒకవేళ ఏదైనా సమస్య ఎదురైతే 155261, 011-24300606 హెల్ప్‌లైన్ నెంబర్లను సంప్రదించాలి.
Also read: Aadhar Card Types: ఆధార్ కార్డు ఎన్ని రకాలుంటుంది. మీరెలాంటి కార్డు వినియోగిస్తున్నారో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook