Pm Modi: అంతవరకూ అయోధ్యలో కాలుపెట్టనని ప్రతిజ్ఞ చేసిన మోదీ
ప్రధాని నరేంద్రమోదీ ( Pm Narendra modi ) 29 ఏళ్ల సుదీర్ఘ విరామం ( After 29 years ) అనంతరం అయోధ్యను సందర్శించారు. రామ మందిర నిర్మాణమయ్యేవరకూ అయోద్యలో కాలుపెట్టనన్న తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నారు మోదీ. 1992లో చేసిన ఆ ప్రతిజ్ఞ ఇవాళ్టికి నెరవేరింది.

అత్యంత ఘనంగా ప్రతిష్టాత్మక రామ జన్మభూమిలో( Ram janmabhoomi ) రామ మందిర ( Rammandir ) నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం ముగిసింది. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ( Pm Narendra modi ) చేతుల మీదుగా ఈ కార్యక్రమం సాగింది. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా ఓ ఆసక్తికర విషయం కూడా వెలుగుచూసింది. అదే ప్రధాని మోదీ 29 ఏళ్ల ప్రతిజ్ఞ నెరవేరడం. జమ్ముకశ్మీర్ కు స్వయంప్రతిపత్తి, ఆర్టికల్ 370 రద్దు ( Abolition of article 370 ) కోరుతూ బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి చేసిన తిరంగా యాత్రకు కన్వీనర్ గా మోదీ చివరిసారిగా 1992లో అయోధ్య ( Modi last visit to ayodhy in 1992 ) పర్యటించారు. రామమందిరం నిర్మించనప్పుడే తిరిగి ఈ ప్రాంతానికి వస్తానని మోదీ అప్పట్లో ప్రతిజ్ఞ చేశారు. మరో విశేషమేమంటే ఆర్టికల్ 370 రద్దయి కూడా నేటికి ఏడాది.
2019 సార్వత్రిక ఎన్నికల ( 2019 General Elections ) సందర్బంగా ఘజియాబాద్, అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో పర్యటించినా సరే అయోధ్యను మాత్రం మోదీ సందర్శించలేదు. రాముడు జన్మించిన ప్రదేశంగా భావిస్తోన్న రామ జన్మభూమిని దర్శించుకున్న తొలి ప్రధాని కూడా మోదీనేనని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. Also read: Ayodhya: ఘనంగా జరిగిన భూమిపూజ