న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో టీబీ నిర్మూలన శిఖరాగ్ర సమావేశం (ఎండ్ టీబీ సమ్మిట్)ను ప్రారంభించనున్నారు. ఈ శిఖర సమ్మేళనాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ కార్యాలయం, స్టాప్ టీబీ పార్టనర్ షిప్ లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సమ్మిట్ లో ప్రధాన మంత్రి, క్షయవ్యాధి నివారణ ప్రచారాన్ని (టీబీ ఫ్రీ ఇండియా ప్రచారం) ప్రారంభించనున్నారు. టీబీని నిర్మూలించడమే లక్ష్యంగా నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ (ఎన్ఎస్‌పీ)మిషన్ ను కేంద్రం ప్రారంభించింది. ఎన్ఎస్‌పీ మిషన్ లో భాగంగా క్షయ వ్యాధి నివారణకు వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టుతారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి టీబీ రోగికి నాణ్యమైన రోగ నిర్ధారణం, చికిత్స, మద్దతు  అందించేటట్టు చూడటానికి రాబోవు మూడు సంవత్సరాల్లో క్షయ వ్యాధి నిర్మూలనకు ఉద్దేశించిన నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ (ఎన్ఎస్‌పీ)కి 12,000 కోట్ల రూపాయలకు పైగా  ఆర్థిక సహాయాన్ని అందిస్తారు.


2025 నాటికి టీబీని అంత‌మొందించాల‌న్నది ప్రధాన మంత్రి విజ‌న్ గా ఉంది. సవరించిన జాతీయ క్షయవ్యాధి కార్యక్రమం (నేషనల్ రివైజ్డ్‌ ట్యూబర్క్యులోసిస్ ప్రోగ్రాం) 1997 లో ప్రారంభమైన నాటి నుండి రెండు కోట్లమంది రోగులకు చికిత్స అందించింది. నేషనల్‌ రివైజ్డ్‌ టి.బి కంట్రోల్‌ ప్రోగ్రాం అనేది డైరెక్ట్‌ అబ్జర్వ్‌డ్‌ ట్రీట్‌మెంట్‌ (డిఓటి) ద్వారా క్షయ రోగులకు చికిత్స అందించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. 2006 మార్చి నాటికి దేశం మొత్తం ఈ పథకం విస్తరించింది.