Modi @ 8 Years: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 8 ఏళ్లు పూర్తయ్యాయి. అదే సమయంలో ప్రధాని మోదీకు 8 నెంబర్‌తో ప్రత్యేక అనుబంధం కూడా ఉంది. అదేంటో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మే 26 అంటే ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 8 ఏళ్లు పూర్తయ్యాయి. మోదీ జీవితం, ఆయన తీసుకున్న నిర్ణయాల్ని పరిశీలిస్తే మోదీకు 8వ నెంబర్‌తో ప్రత్యేక సంబంధం ఉందని తెలుస్తోంది. కీలకమైన నిర్ణయాలతో నెంబర్ 8తో అనుబంధం ముందని అర్ధమౌతోంది. ప్రధానమంత్రి మోదీ కార్యాలయంలో ఎక్కువ నిర్ణయాలు 8వ నెంబర్‌తో ముడిపడి ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయం 2019 నవంబర్ 8వ తేదీన తీసుకున్నారు. మరోవైపు 2019 ఆగస్టు 8వ తేదీన ఆర్టికల్ 370 పై దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా మహమ్మారి నేపధ్యంలో రాత్రి 8 గంటలకే లాక్‌డౌన్ ప్రకటన చేశారు.


ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టిన తేదీ సెప్టెంబర్ 17. అంటే టోటల్ 8. ఆయన కీలకమైన నిర్ణయాలన్నీ 8, 17, 26 తేదీల్లో ఉంటున్నాయి. అంటే ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ 8తో ముడిపడి ఉంటున్నాయి


ప్రధాన మంత్రి మోదీ పుట్టిన తేదీ సెప్టెంబర్ 17...అంటే 1+7=8
గుజరాత్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేసిన తేదీ డిసెంబర్ 26 అంటే 2+6=8
2014లో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తేదీ మే 26 అంటే 2+6=8
తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తేదీ మే 26 అంటే 2+6=8
నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్న తేదీ నవంబర్ 8 అంటే టోటల్ 8
2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీ నామినేషన్ వేసింది ఏప్రిల్ 26 అంటే 2+6=8
ముద్ర పథకాన్ని ప్రారంభించిన తేదీ ఏప్రిల్ 8
పాకిస్తాన్ బాలాకోట్‌పై ఎయిర్‌స్ట్రైక్స్ చేయాలని నిర్ణయించిన తేదీ ఫిబ్రవరి 26 అంటే 2+6=8
17వ లోక్‌సభలో మోదీ రెండవసారి ప్రధాని అయిన తేదీ 17 అంటే  1+7=8


Also read: Cars Prices, Bikes Prices: కారు లేదా బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా ? అయితే ఇది మీ కోసమే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి