కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూయడం తెలిసిందే. 82 ఏళ్ల బీజేపీ సీనియర్ నేత ఆదివారం ఉదయం తుదిశ్వాస (Jaswant Singh Passes Away) విడిచారు. జశ్వంత్ సింగ్ మరణం పట్ల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ (Jaswant Singh Dies) మృతిపట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. Jaswant Singh Dies: కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘భారతదేశానికి జశ్వంత్ సింగ్ పలు విధాలుగా ఎంతో సేవ చేశారు. తొలుత సైనికుడిగా, ఆపై రాజకీయాల్లోకి వచ్చి సేవలు అందించిన ఘనత జశ్వంత్ సింగ్ సొంతం. అటల్ బిహారి వాజ్ పేయి ప్రభుత్వంలో కీలక శాఖలైన ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖల బాధ్యలను సమర్థవంతంగా నిర్వహించారు. ఆయన మృతి చాలా బాధాకరమని’ ప్రధాని నరేంద్ర మోదీ తన మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. CoronaVirus Vaccine: సింగిల్ డోస్‌తో కరోనా వైరస్ అంతం! 



 


సమాజం, రాజకీయాలు అనే అంశాలలో ఆయన చాలా బాధ్యతగా ఉండేవారని జశ్వంత్ సింగ్ వ్యక్తిత్వాన్ని ప్రధాని మోదీ కొనియాడారు. బీజేపీ బలోపేతం కోసం చాలా శ్రమించారని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఓం శాంతి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.  SPB News: వెంటాటి వెంటాడి వేధించి తీసుకెళ్లిపోయింది: గాయని సుశీల ఆవేదన 


 ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe