కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ నేత జశ్వంత్ సింగ్ కన్నుమూశారు (Jaswant Singh Dies). ఆయన వయసు 82 ఏళ్లు. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ప్రభుత్వంలో కీలక మంత్రి పదవులు నిర్వహించారు. రక్షణ మంత్రిగా, విదేశీ వ్యవహారాలశాఖ మంత్రిగా తనదైన ముద్ర వేశారు జశ్వంత్ సింగ్. దేశానికి ఎంతో కీలకమైన ఆర్ధికశాఖకు సైతం సీనియర్ నేత తనదైన మార్కు సేవలందించారు. జశ్వంత్ సింగ్ మరణం పట్ల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు.
రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘సీనియర్ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూశారు. ఇది చాలా బాధాకరం. రక్షణమంత్రి లాంటి పదవులతో పాటు ఎన్నో కీలకశాఖలలో పని చేసి సేవలందించారు. సమర్థవంతమైన మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారని’ తన ట్వీట్ లో రాజ్‌నాథ్ పేర్కొన్నారు. CoronaVirus Vaccine: సింగిల్ డోస్‌తో కరోనా వైరస్ అంతం!
Deeply pained by the passing away of veteran BJP leader & former Minister, Shri Jaswant Singh ji. He served the nation in several capacities including the charge of Raksha Mantri. He distinguished himself as an effective Minister and Parliamentarian.
— Rajnath Singh (@rajnathsingh) September 27, 2020
ఫొటో గ్యాలరీలు
-
నటి అన్వేషి జైన్ బ్యూటిఫుల్ ఫొటోస్
-
Purple Cap Winners of IPL: మ్యాచ్‌లు మలుపుతిప్పిన బౌలర్లు వీరే..
- Anchor Anasuya Photos: యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ ఫొటోస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe