PM Narendra Modi: కశ్మీర్ పై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్ తీరును ఎండగట్టిన ప్రధాని మోదీ..
PM Narendra Modi: జమ్మూ కశ్మీర్ పై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విపక్షాల తీరును ఎండగట్టారు. కశ్మీర్‌కు దేశంతో సంబంధం లేదా అంటూ కడిగిపారేసారు.
PM Narendra Modi: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే పై దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీప్రస్థాయిలో విరుచుకు పడ్డారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని రాజస్థాన్‌లో ఎందుకని జైపూర్‌లో ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ప్రధాని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. జమ్మూ కశ్మీర్‌కు మిగతా భారతదేశంతో సంబంధం లేదా అని తనదైన శైలిలో మండిపడ్డారు. ఇది టుకడే టుకడే గ్యాంగ్ భాషగా పేర్కొన్నారు. ఆదివారం ప్రధాన మంత్రి బిహార్‌తో పాటు పశ్చిమ బంగాల్‌లోని జల్పాయుగురులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజస్థాన్‌లో ఖర్గే జమ్మూ కశ్మీర్ పై చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి అనేది చిన్నది కాదు.. ఆ పదవిలో ఉన్న ఖర్గే జీ 370 రద్దు గురించి ఏం మాట్లాడారు. జమ్మూ కశ్మీర్‌కు రాజస్థాన్ ప్రజలతో సంబంధం ఏంటని అడుగుతారా...?
జమ్మూ కశ్మీర్ మన దేశంలో అంతర్భాగం కాదా.. ? కాంగ్రెస్ పెద్ద మనిషి చేసిన వ్యాఖ్యలకు నేను సిగ్గుపడుతున్నాను. దేశ రక్షణ కోసం బిహార్ ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారు. జమ్మూ కశ్మీర్‌ను రక్షించే క్రమంలో ఎందరో జవానులు వీర మరణం పొందారు. రాజస్థాన్ చెందిన యువత కూడా జమ్మూ కశ్మీర్ కోసం బలిదానాలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఇపుడు కాంగ్రెస్ పార్టీ జమ్మూ కశ్మీర్‌కు ఆయా రాష్ట్రాలకు ఏంటి సంబంధం అని అడుగుతారా.. ? ఇది విచ్ఛినకరమైన ముఠా చేస్తున్న మాటల దాడులను మనం ఓటుతో తిప్పికొట్టాలని ప్రజలకు ప్రధాని పిలుపు నిచ్చారు. ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేసిన వాళ్లను ప్రజలు క్షమించరన్నారు.
మరోవైపు శనివారం రాత్రి తృణమూల్ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడానికి వెళ్లిన ఎన్ఐఏ అధికారులను టీఎంసీ కార్యకర్తలు వారిపై దాడి చేసి కేసు పెట్టారన్నారు. బెంగాల్‌లో టీఎంసీ సిండికేట్ నడస్తోందన్నారు. అవినీతి నేతలను కాపాడడమే మమత ప్రభుత్వం ఏకైక లక్ష్యమన్నారు. రాష్ట్రంలో దోపిడి, భయానక పరిస్థితులు, అవినీతి, హింసకు టీఎంసీ ఫ్రీ లైసెన్స్ ఇచ్చేసిందన్నారు. దేశ రాజ్యాంగాన్ని, చట్టాలను పట్టించుకోని ఈ ప్రభుత్వానికి ఓటుతో ప్రజలు బుద్ది చెప్పాలన్నారు.
ఇక పేద బడుగు బలహీన వర్గాల కోసం కేంద్రం తెచ్చిన ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను దీదీ బెంగాల్‌లో అమలు చేయడం లేదన్నారు. వివిధ అవినీతి కేసులకు సంబంధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. దాదాపు రూ. 3 వేల కోట్లు జప్తు చేసిందన్నారు. నేను అవినీతిని నిర్మూలిస్తానంటే.. ప్రతిపక్షాలు మాత్రం వాళ్ల కూటమిలో ఉన్న అవినీతి పరులకు అండగా ఉంటున్నారని దుయ్యబట్టారు. అవినీతి పరులను రక్షించడం కోసమే.. ఇండి కూటమి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బెంగాల్‌లోని సందేశ్ ఖాలీలో జరిగిన అత్యాచారాలను యావద్దేశం చూసిందన్నారు. ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడిన వారికి యావజ్జీవం జైల్లోనే ఉండేలా చేస్తానన్నారు.
Also Read: KCR Arrest: కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమా? రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఇదేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook