న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామ జిల్లా అవంతిపురలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన ఉగ్రవాదులు 39 మంది సైనికులను పొట్టనపెట్టుకున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సైనికుల పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని సీఆర్పీఎఫ్ అధికారిక వర్గాలు తెలిపాయి. పేలుడు జరిగిన చోట ఎటు చూసినా భయంకరమైన వాతావరణం కనిపించింది. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ... అమరులైన సైనికుల త్యాగాలు ఊరికేపోవు అని అన్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ.. అమర సైనికుల కుటుంబాలకు దేశం అండగా నిలుస్తుందని అన్నారు. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ప్రధాని ట్విటర్‌లో పేర్కొన్నారు.