న్యూఢిల్లీ: ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ట్విటర్ ద్వారా స్పందించారు. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెల్చుకుని విజయం సాధించిన జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నాయకుడు హేమంత్ సోరెన్‌కు, జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ... పరిపాలనలోనూ కూటమికి మంచి జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. అదే సమయంలో గతంలో ఝార్ఖండ్‌ని పరిపాలించే అవకాశాన్ని బీజేపికి ఇచ్చినందుకు  జార్ఖండ్ ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. బీజేపి కోసం కృషిచేసిన పార్టీ కార్యకర్తలకు సైతం ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్ష జేఎంఎం కూటమి విజయం దాదాపు ఖరారైన నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ ట్వీట్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఫిర్యాదు.. స్పందించిన ఇసి



జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలు ఉండగా విజయం సాధించేందుకు అవసరమైన 41 మేజిక్ ఫిగర్‌ను అందుకోవడంలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి విజయవంతమైంది. జీ హిందుస్తాన్ తెలుగు లైవ్ టీవీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. Watch Zee Hindustan Telugu live TV here