కరోనావైరస్ విషయంలో అందుకే ఆందోళన తప్పడంలేదు: ప్రధాని మోదీ
కరోనావైరస్ దేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ప్రస్తుత తరుణంలో వైరస్ ఎటాక్ అనంతరం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, వివిధ అంశాలను ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
కరోనావైరస్ (Coronavirus) మన దేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ప్రస్తుత తరుణంలో వైరస్ ఎటాక్ అనంతరం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, వివిధ అంశాలను ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ((PM Narendra Modi`s speech on Coronavirus) ప్రసంగించారు. గత రెండు నెలల నుంచి కరోనా వైరస్ యావత్ మానవాళిని ఉలిక్కిపడేలా చేసిందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ గుర్తుచేశారు. ప్రస్తుతం మన దేశమే కాకుండా అన్ని ప్రపంచదేశాలు కరోనావైరస్ బారినపడ్డాయి. ఇప్పటివరకు కరోనావైరస్‌ని ఎదుర్కొనేందుకు సరైన వ్యాక్సిన్ కనుగొనలేదు కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఆందోళన చెందడం సహజమే అని మోదీ అన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని కరోనా వైరస్‌ని అరికట్టేందుకు దేశ ప్రజలు అందరూ కృషిచేయాల్సిందిగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..