PM Modi to Chair All party Meeting : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షతన ఈ నెల 28న అఖిలపక్ష సమావేశం జరిగే అవకాశం ఉంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ఒకరోజు ముందు జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించవచ్చు. నవంబర్ 28న ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఫ్లోర్‌లీడర్ల సమావేశం జరగనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament Winter Session 2021) ఈ నెల 29 నుంచి డిసెంబర్ 23 వరకు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లోనే సాగు చట్టాల రద్దు బిల్లులను ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం ఉంది. మూడు చట్టాలను రద్దు చేసేందుకు మూడు వేర్వేరు బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందాల్సి ఉంటుంది. అంతకుముందు, కేంద్ర కేబినెట్ ఈ చట్టాల రద్దుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 24న కేంద్ర కేబినెట్ ఆ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.


Also Read: త్వరలో సమగ్ర వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెడతామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్


పార్లమెంటులో సాగు చట్టాల రద్దు ప్రక్రియ పూర్తయ్యేంతవరకూ ఆందోళన విరమించబోమని రైతు సంఘాలు (Farmers Protest) ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే కనీస మద్దతు ధరపై కూడా తేల్చాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 27న భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు సాగు చట్టాల రద్దు డ్రామా అని... వచ్చే ఏడాది 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని విపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు అయిపోగానే సాగు చట్టాలను మళ్లీ తెరపైకి తెస్తారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతుల్లో అనుమానాలకు తావివ్వకుండా ఉండాలంటే ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే సాగు చట్టాల రద్దు (Farm Laws) ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. కేంద్రం కూడా ఆ ఉద్దేశంతోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కనీస మద్దతు ధరకు చట్టంపై ఏం తేలుస్తారన్నది వేచి చూడాలి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook