భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
నేడు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని భారతీయులు అందరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని, అష్ట ఐశ్వర్యాలతోపాటు ఆరోగ్యంగా ఉండాలనేదే తన ఆకాంక్ష అని చెబుతూ ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఓ ట్వీట్ చేశారు. ఈ దీపావళి అందరి జీవితాల్లోకి సకల శుభాలు, వెలుగును తీసుకురావాలని కోరుకుంటున్నట్టు మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.