PM Narendra Modi's 71st Birthday: నేడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ 71 వ పుట్టినరోజు, ఈ సందర్భంగా, బీజేపీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా విభిన్న కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పుట్టినరోజు సందర్భంగా, నామో యాప్‌లో (Namo)ప్రధాని మోదీ పుట్టినరోజుకు సంబంధించిన ఎగ్జిబిషన్ చూపబడుతుంది. పుట్టిన తోజు సందర్భంగా NaMo యాప్‌లో 'అమృత్ ప్రయాస్' (Amrit Prayas) అనే ఆప్షన్ కలిపారు. దీని ద్వారా ప్రజలు రక్తదాన శిబిరం, పరిశుభ్రత ప్రచారం, వృద్ధాశ్రమంలో సేవ వంటి కార్యక్రమాలలో స్వతహాగా పాల్గొనవచ్చు. పుట్టిన రోజు సందర్భంగా దేశానికి సేవ చేయడానికి ప్రతిజ్ఞ చేయాలని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరో విషయం ఏమిటంటే, ప్రధాని మోదీ తన 71 వ పుట్టినరోజును సాధారణ రోజులాగే, ఎలాంటి సంబరాలు, వేడుకలు లేకుండానే గడపాలని నిర్ణయించుకున్నారు. 


Also Read: Shocking News: వీడు చదివేదే 6వ తరగతి.. కానీ బ్యాంకు అకౌంట్లో రూ. 900 కోట్లు!


సేవ మరియు డెడికేషన్ కాంపెయిన్స్ ప్రారంభం
ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో 'సేవ మరియు సమర్పన్ అభియాన్' (Seva and Samarpan Abhiyan) కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం అక్టోబర్ 7 వరకు కొనసాగనుంది, అంతేకాకుండా, ప్రధాని మోదీ తన ఇరవై సంవత్సరాల రాజకీయ ప్రయాణం కూడా అక్టోబర్ 7 న పుర్తవ్వనుంది. అలాగే, బీజేపీ యూత్ ఆర్గనైజేషన్ (BJP youth organization) ఈ రోజు రక్తదాన శిబిరాన్ని నిర్వచించనుంది.  ఈ ప్రచారంలో, బీజేపీ కార్యకర్తలు ప్రతిగ్రామానికి, ఇంటింటికీ, చేరుకొని, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అంతేకాకుండా, ఈ సేవా కార్యక్రమాల్లో ఫ్రంట్ అండ్ సెల్ వర్కర్లు కూడా పాల్గొంటారు. 


ఈ క్యాంపెయిన్ లో భాగంగా, సెప్టెంబర్ 17 నుండి సెప్టెంబర్ 20 వరకు హెల్త్ చెక్ అప్ శిబిరం నిర్వహించబడనున్నాయి. ఈ శిబిరాలు మెడికల్ సెల్ (Medical Cell) అధీనంలో జరగనున్నాయి. యువ మోర్చా కార్యకర్తలు రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు. 


Also Read: Kohli Step Down From T20 Captain: కోహ్లీ సంచలన నిర్ణయం.. టీ20 కెప్టెన్సీకి గుడ్ బై!


అయితే, షెడ్యూల్డ్ ఫ్రంట్ కార్మికులు పేదల ఇళ్లల్లో పండ్లు మరియు ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్నారు. మరోవైపు, బాక్ వర్డ్ క్లాస్ వర్కర్స్ అనాథాశ్రమం మరియు వృద్ధాశ్రమాల్లో పండ్ల పంపిణీ మరియు ఇతర సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 


రైతులకు సన్మానం
ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా నిర్వచించబడే సేవ మరియు డెడికేషన్ కాంపెయిన్ లో, కిసాన్ సమ్మన్ దివాస్ (Kisan Samman Diwas) నిర్వహణలో 71 మంది రైతులను మరియు 71 మంది జవాన్లను కిసాన్ మోర్చా (Kisan Morcha) సత్కరించనుంది. కరోనా సమయంలో నిరంతర సేవ చేసిన 71 మహిళలను మహిళా మోర్చా సత్కరించనుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook