న్యూఢిల్లీ: ప్రధాని మోదీ పిలుపు మేరకు కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలోదేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్ల లైట్లను ఆపి సంఘీభావం ప్రకటించారు. టార్చ్ లైట్లను ఆన్ చేసి బాల్కనీల వద్ద దీపాలు వెలిగించారు. కరోనావైరస్ మహమ్మారిని పారదోలడానికి దీపాలు, కొవ్వొత్తులను టార్చ్ లైట్లను ఉపయోగించమని ప్రధానమంత్రి శుక్రవారం ఒక వీడియో సందేశంలో ప్రజలను కోరిన విషయం తెలిసిందే. ఆందోళనకరమైన SARS-CoV-2 వైరస్ బారిన పడిన ప్రపంచానికి ఈ కార్యక్రమం శక్తివంతమైన సందేశాన్ని పంపుతుందని ఆయన అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్చి 24న ప్రధాని మోదీ దేశాన్ని ఉద్దేశించి భయంకరమైన కరోనా సంక్రమణను నివారించాలనే ఉద్దేశ్యంతో 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆందోళనకర పరిస్థితుల్లో అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై క్షమాపణలు కోరారు. వైరస్ సంక్రమణను నివారించాలనే ఆలోచనతో ఈ సాహసం చేయవలిసి వచ్చిందని, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నప్పటికీ లాక్‌డౌన్ ప్రకటించవలిసివచ్చిందని పేర్కొన్నారు. 


భారత్ లో ఇప్పటివరకు సమాజ సంక్రమణ జరగలేదని, పరిస్థితి అదుపులో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. మరోవైపు ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొంటుందని తెలిపారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..