యోగా.. చేయాల్సిందే..!!
`కరోనా వైరస్` ..వేగంగా విస్తరిస్తున్న క్రమంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 2.0 కొనసాగుతోంది. మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. దీంతో ప్రజలను రోడ్లపైకి రావొద్దని..ఇళ్లల్లోనే ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.
'కరోనా వైరస్' ..వేగంగా విస్తరిస్తున్న క్రమంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 2.0 కొనసాగుతోంది. మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. దీంతో ప్రజలను రోడ్లపైకి రావొద్దని..ఇళ్లల్లోనే ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.
పోలీసులు నిరంతం రోడ్లపై పహారా కాస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చిన వారు ఎవరైనా ఉంటే.. వారిని తిరిగి ఇళ్లకు పంపిస్తున్నారు. కానీ జనం ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండలేకపోతున్నారు. ఇప్పటికే ఇళ్ల నుంచి బయటకు వచ్చి 23 రోజులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఉండబట్టలేక ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు.
అలాగే మహారాష్ట్రలోని పూణేలో కొంత మంది ఉదయాన్నే ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చారు. ఉదయం పూట పోలీసులు ఉండరని వారు అనుకున్నారు. కానీ పోలీసులు రోడ్డుపైనే పహారా కాస్తున్నారు. ఉదయం నడక కోసం బయటకు వచ్చిన వారిని పట్టుకున్నారు. ఇళ్ల నుంచి బయటకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఐతే మార్నింగ్ వాక్ కోసం వచ్చామని వారు తెలిపారు. మేం ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఎన్ని రోజులు ఉండాలని ప్రశ్నించారు.
దీంతో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు వారిపై ఆగ్రహించారు. దీంతో వారితో శిక్ష కింద యోగా చేయించారు. దాదాపు అరగంటపాటు యోగాసనాలు వేయించి పంపించారు. సామాజిక దూరం పాటిస్తూ యోగా చేయించి ఇళ్లకు తిరిగి పంపడం విశేషం.