Poliovirus: పోలియో ఒకప్పుడు అత్యంత ప్రమాదకరమైన వైరస్. చాలా ఏళ్ల క్రితమే ఇండియా పోలియో రహిత దేశంగా ప్రకటితమైంది. కానీ ఇప్పుడు కోల్‌కతాలో వెలుగుచూసిన పోలియో వైరస్ ఆందోళన కల్గిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో మరోసారి పోలియో ముప్పు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇండియా పోలియో విముక్త దేశంగా ప్రకటితమైన తరువాత వెలుగుచూసిన పోలియో వైరస్ కేసులు ఆరోగ్యశాఖను ఆందోళనలో పడేస్తున్నాయి. పోలియో వైరస్ కొత్త వేరియంట్ పశ్చిమ బెంగాల్ హౌరాలో వెలుగుచూశాయి.


హౌరాలో చివరిగా 2011లో ఓ బాలుడి శరీరంలో పోలియో వెలుగుచూసింది. ఆ తరువాత 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇండియాను పోలియో విముక్త దేశంగా ప్రకటించింది. కానీ 8 ఏళ్ల అనంతరం ఆరోగ్యశాఖ ఆందోళన మరోసారి పెరుగుతోంది. కోల్‌కతాలో పోలియో వైరస్ వెలుగు చూసింది. ఆరోగ్యశాఖ అందిస్తున్న వివరాల ప్రకారం...మేటియాబురుజ్ ప్రాంతంలోని సీవేజ్ నీటిలో పోలియో కీటాణువులు వెలుగు చూశాయి. దాంతో ఈ ప్రాంతంలో పరిశీలన, పర్యవేక్షణ పెంచేసింది ఆరోగ్యశాఖ. రాష్ట్రంలోని అన్ని మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అలర్ట్ ప్రకటించారు. 


పదేళ్ల అనంతరం కన్పిస్తున్న ముప్పు


పదేళ్లకు పైగా సమయం తరువాత ఆరోగ్యశాఖ కోల్‌కతాలో పోలియో వైరస్ కనుగొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. యూనిసెఫ్‌తో కలిసి చేసిన ఉమ్మడి ప్రయత్నాల్లో పోలియో వైరస్ కనుగొన్నారు. ఈ తరహా పరీక్షలు అప్పుడప్పుడూ కోల్‌కతా ప్రాంతంలో చేస్తుంటారు. పోలియో వైరస్ ఈ ప్రాంతంలో కనుగొన్న తరువాత మెటియాబుజ్ ప్రాంతంలో ఎక్కడా పబ్లిక్ టాయ్‌లెట్స్ ఉండకూడదని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల్లో కూడా తక్కువ రోగ నిరోధకత ఉన్న పిల్లలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అటువంటి పిల్లల మలం నమూనాలు కూడా పరీక్ష చేయాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది. దాంతోపాటు వ్యాక్సినేషన్‌పై ఫోకస్ పెంచారు. 2011లో హౌరాకు చెందిన 12 ఏళ్ల అమ్మాయిలో పోలియో లక్షణాలు కన్పించాయి. 2014 మార్చ్ 27 న ఇండియా పోలియో విముక్త దేశంగా ప్రకటితమైంది. 


Also read: Indian Railways Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. 1.48 లక్షల రైల్వే ఉద్యోగాల భర్తీకి ప్రకటన!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook