Prashant Kishor Comments: కొత్తపార్టీ పెట్టడం లేదన్న ప్రశాంత్ కిషోర్ - కొత్త ప్లానేంటో తెలుసా?
Prashant Kishor Comments: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్ కొత్తపార్టీ విషయంలో క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ పెట్టడం లేదని ప్రకటించారు. దీంతో, పీకే కొత్తపార్టీ గురించి కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చకు తెరపడింది.
Prashant Kishor Comments: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్ కొత్తపార్టీ విషయంలో క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ పెట్టడం లేదని ప్రకటించారు. దీంతో, పీకే కొత్తపార్టీ గురించి కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చకు తెరపడింది. స్వయంగా ప్రశాంత్ కిషోరే చెప్పడంతో పార్టీ విషయంలో స్పష్టత వచ్చింది. అయితే, పార్టీకి బదులు ప్రశాంత్ కిషోర్ కొత్త ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. బీహార్ కేంద్రంగానే ఆ ప్లాన్ అమలు చేయబోతున్నట్లు తేల్చి చెప్పారు.
ఇటీవలే ప్రశాంత్‌కిషోర్ ట్విట్టర్‌లో సరికొత్త అంశాన్ని ప్రస్తావించారు. ప్రజలను నేరుగా కలుసుకోవాల్సిన సమయం వచ్చిందని, దానికి ‘జన సురాజ్’ మార్గమని, బిహార్ నుంచే ఈ కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నట్లు పీకే ట్వీట్ చేశారు. దీంతో, ఈ ట్వీట్ రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పీకే సొంతంగా పార్టీ పెట్టబోతున్నారన్న వార్తలు హల్‌చల్ చేశాయి. ఇన్నాళ్లు రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న పీకే.. సొంతంగా పార్టీ పెడితే తిరుగు ఉండబోదన్న విశ్లేషణలు కూడా సోషల్ మీడియాలో సాగాయి. అయితే, ఈ ప్రచారంపై పీకే తాజాగా స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతానికి కొత్తపార్టీ పెట్టడం లేదన్నారు. అయితే, బీహార్ పురోగతి కోసం 3వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. దీంతో, పీకే 'జన సురాజ్' నినాదంపైనా స్పష్టత వచ్చింది. జన సురాజ్ అంటే కొత్త రాజకీయ పార్టీ కాదని, పాదయాత్రతో జనంలోకి వెళ్లబోతున్నారని విశ్లేషకులు అంచనాకు వచ్చారు.
కొత్త పార్టీ పెట్టడం లేదన్న పీకే.. బీహార్‌ను బలోపేతం చేసేందుకు తాను అంకితమవుతానని ప్రకటించారు. బీహార్‌లో ఇటీవలి కాలంలో ఎన్నికలేవీ లేవని, ఇప్పట్లో కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించే ప్లాన్ ఏదీ లేదన్నారు. కానీ, మూడు నాలుగేళ్లలో ప్రజలకు చేరువయ్యే పనిలో నిమగ్నం అవుతానని పీకే చెప్పారు. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నుంచి మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టనున్నట్లు పీకే వెల్లడించారు. పశ్చిమ చంపారన్‌లోని గాంధీ ఆశ్రమం నుంచి ఈ పాదయాత్ర మొదలు పెడతానని చెప్పారు. తన పాదయాత్రలో వీలైనంత మందిని కలుస్తానని తెలిపారు.
త్వరలోనే బీహార్‌కు చెందిన దాదాపు 18వేలమంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలిసి, రాజకీయంగా వారితో చర్చించనున్నట్లు పీకే వెల్లడించారు. వాళ్ల కోణం నుంచి రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, అభివృద్దికి అవసరమైన సలహాలపై అభిప్రాయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో బీహార్ ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి సంబంధించి ఒక రాజకీయ వేదిక కావాలని ఆకాంక్షిస్తే ఆ విషయం గురించి తప్పకుండా ఆలోచిస్తానని చెప్పారు. ఇతర రాష్ట్రాల కంటే బీహార్ చాలా వెనుక బడి ఉందన్న ప్రశాంత్ కిషోర్ రాష్ట్ర అభివృద్ధి కోసం చాలా చేయాల్సి ఉందన్నారు. లాలూప్రసాద్ యాదవ్, నితీష్‌కుమార్ పాలనలో బీహార్ ఏమాత్రం పురోగతి సాధించలేదన్నారు. ఆ విషయం గురించి తాను తప్పకుండా ఆలోచిస్తానన్నారు. ఆ క్రమంలో వచ్చే మూడు, నాలుగు సంవత్సరాలు పాటు ప్రజలను కలుస్తానని, క్షేత్రస్థాయిలో వాస్తవాలను అధ్యయనం చేస్తానని ఆ క్రమంలోనే ఇంటింటికీ వెళ్లి అందరితో మాట్లాడతానని, సామాన్యుల అభిప్రాయాలు కూడా తీసుకుంటానని ప్రశాంత్ కిషోర్ వివరించారు.
Also Read: Kohli Dhoni: ఎంఎస్ ధోనీకి విరాట్ కోహ్లీ క్షమాపణలు చెప్పాల్సిందే.. మహీ పాదాలను తాకాల్సిందే..!
Also Read: Ex Mp Meets Bandi Sanjay : నడ్డా పర్యటనకు ముందు బండి సంజయ్ తో మాజీ ఎంపీ, కీలకనేత భేటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.