Fans demand Virat Kohli to apologise MS Dhoni: ఐపీఎల్ 2022లో భాగంగా బుధవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 13 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మహిపాల్ లామ్రోర్ (27 బంతుల్లో 42, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఫాఫ్ డుప్లెసిస్ (22 బంతుల్లో 38, 4ఫోర్లు, సిక్స్) రాణించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 173 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో చెన్నై 8 వికెట్లకు 160 పరుగులు చేసి ఓటమిని ఎదుర్కొంది. డెవాన్ కాన్వె (37 బంతుల్లో 56, 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), మొయిన్ అలీ (27 బంతుల్లో 34, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడినా చెన్నైకి ఓటమి తప్పలేదు.
లక్ష్య ఛేదనలో బ్యాటర్లు డెవాన్ కాన్వె, మొయిన్ అలీలు చెలరేగడంతో ఓ దశలో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించేలా కనిపించింది. అయితే కాన్వె, అలీ స్వల్ప వ్యవధిలో ఔట్ అయినా.. ఎంఎస్ ధోనీ క్రీజులో ఉండడంతో చెన్నై విజయంపై నమ్మకంగానే ఉంది. చివరి రెండు ఓవర్లలో చెన్నై విజయానికి 38 పరుగులు అవసరం అయ్యాయి. ఈ సీజన్లో మంచి ఊపుమీదుండడమే కాకుండా.. ఇప్పటికే ఓ మ్యాచులో చివరి ఓవర్లో చెన్నైని గెలిపించిన మహీపై అందరూ నమ్మకంగా ఉన్నారు. మరోవైపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లలో కాస్త కంగారు నెలకొంది.
19వ ఓవర్ వేసిన జోస్ హాజిల్‌వుడ్.. మొదటి బంతికే ఎంఎస్ ధోనీని ఔట్ చేశాడు. భారీ షాట్ ఆడిన మహీ.. రజత్ పాటిదార్ చేతికి చిక్కి ఔట్ అయ్యాడు. దాంతో బెంగళూరు ఆటగాళ్ల ఆందనడానికి అవధుల్లేకుండా పోయాయి. ముఖ్యంగా బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అతి చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఆ సమయంలో అసభ్యకర భాష వాడుతూ సెలబ్రేట్ చేసుకున్నట్లుగా కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Unacceptable, He is literally abusing indian army personnel Ms Dhoni. 💔
Always knew this kohli is a anti-national.#CSKvRCB pic.twitter.com/w7uom4VGpg
— Sir Dinda⁴⁵ (@SirDindaTweet) May 4, 2022
ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ కెప్టెన్, టీమిండియా మాజీ కెప్టెన్ అయిన ఎంఎస్ ధోనీపై అభ్యంతరకర భాష వాడడంతో విరాట్ కోహ్లీపై అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో కోహ్లీపై ట్వీట్ల వర్షం కురిపిస్తూ విమర్శలు చేస్తున్నారు. 'ఎంఎస్ ధోనీకి విరాట్ కోహ్లీ క్షమాపణలు చెప్పాల్సిందే.. మహీ పాదాలను తాకాల్సిందే' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'గురువు ఎంఎస్ ధోనీ పట్ల నీకున్న గౌరవం ఇదేనా' అని మరొకరు ట్వీట్ చేశారు. అయితే మరికొందరు మాత్రం కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు. 'ధోనీ వికెట్ అని కాదు.. ఏ వికెట్ పడినా కోహ్లీ ఇలానే సంబరాలు చేసుకుంటాడు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
No he really abused him
We want Kohli to apologise & touch Dhoni's feet for this— Ayush 🏏 (@pacophile) May 5, 2022
Lol not a big wicket 😂😂😂
Bruh they required 46 or something off last 3 overs still we were in tention becuz dhoni was on strike
Dude he could do anything up thereThat celebration was for the victory of RCB
— kohli ka Pankha (@prathmesh_510) May 5, 2022
Always knew this guy was a snake. Mahirat and all is just a way of making himself relevant by sucking up to an icon like Dhoni. This is his level and reality. He will always remain inferior to Dhoni. https://t.co/6FrvoAXxpY
— ` (@FourOverthrows) May 4, 2022
Unacceptable, He is literally abusing indian army personnel Ms Dhoni. 💔
Always knew this kohli is a anti-national.#CSKvRCB pic.twitter.com/w7uom4VGpg
— Sir Dinda⁴⁵ (@SirDindaTweet) May 4, 2022
I liked kohli celebration after dhoni wicket 🤩😍
— Dwight Schrute (@Conano_) May 5, 2022
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.