Jharkhand Crisis: జార్ఖండ్‌లో `మహా` డ్రామా రిపీట్ అవుతుందా..? ఎమ్మెల్యేల తరలింపు ముమ్మరం..!
Jharkhand Crisis: జార్ఖండ్‌లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఎమ్మెల్యేల తరలింపు ముమ్మరం సాగుతోంది.
Jharkhand Crisis: జార్ఖండ్‌లో రాజకీయాలు హీటెక్కాయి. సీఎం హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలే పరిస్థితి ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం సోరెన్ శాసనసభ్యత్వంపై గవర్నర్ అనర్హత వేటు వేస్తే..ప్రభుత్వం కూలకుండా ఉండేందుకు సోరెన్ వ్యూహాలకు పదును పెట్టారు. తమ ఎమ్మెల్యేలు ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. బేరసారాల నుంచి వారిని కాపాడుకునేందుకు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఈనేపథ్యంలోనే సీఎం హేమంత్ సోరెన్ నివాసం దగ్గర రెండు బస్సులు ఉన్న దృశ్యాలు కనిపించాయి. దీంతో రిసార్ట్ రాజకీయాలు మొదలైయ్యాయి. మహారాష్ట్రలో జరిగిన పొలిటికల్ చిత్రమ్ ఇక్కడ జరిగే ప్రమాదం ఉందని సోరెన్ వర్గం భావిస్తోంది. ఈక్రమంలోనే ఎమ్మెల్యేలంతా సీఎం నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచే ప్రత్యేక బస్సుల్లో వెళ్లిపోయారు. వారంతా కుంతీ జిల్లాకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్, బెంగాల్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
జార్ఖండ్ అసెంబ్లీలో 81 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో సోరెన్ సర్కార్‌కు 49 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. 30 మంది సభ్యులతో జార్ఖండ్ ముక్తి మోర్చా అతి పెద్ద పార్టీగా ఉంది. కాంగ్రెస్‌కు 18 మంది, ఆర్జీడీకి ఓ ఎమ్మెల్యే ఉన్నారు. బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సోరెన్‌పై గవర్నర్ అనర్హత వేటు వేస్తే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది. మధ్యంతర ఎన్నికలు పెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
ఈక్రమంలోనే సంకీర్ణ ప్రభుత్వం ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో ఉంది. ఇటీవల రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోయాయి. బీజేపీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వాలు వచ్చాయి. అలాంటి పరిణామాలు రాకుండా సోరెన్ పావులు కదుపుతున్నారు. సీఎంగా ఉంటూ గనుల లీజును సోరెన్.. తనకు తానే కేటాయించుకున్నారని విమర్శలు వచ్చాయి. ఈవ్యవహారం నిబంధనలకు విరుద్ధమంటూ రాజ్‌భవన్‌లో బీజేపీ ఫిర్యాదు చేసింది.
ఇందులోభాగంగానే ఈసీ అభిప్రాయాన్ని గవర్నర్ రమేష్ బైస్ తెలుసుకున్నారు. ఈసీ సైతం తన అభిప్రాయాన్ని సీల్డ్ కవర్ రూపంలో రాజ్‌భవన్‌కు పంపింది. ఇవాళ గవర్నర్ రమేష్ బైస్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ్యత్వంపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also read:Revanth Reddy: రామగుండంలో ఉద్యోగాల పేరిట మోసం..సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ..!
Also read:Jayalalithaa Death Probe: సీఎం స్టాలిన్ వద్దకు చేరిన జయలలిత డెత్ రిపోర్ట్..నివేదికలో అసలేముందంటే..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి