Revanth Reddy: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ సంధించారు. రామగుండం ఎరువుల పరిశ్రమలో ఉద్యోగాల నియామకంలో అవకతవకలు జరిగినట్లు లేఖలో పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న యువకుడిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రామగుండం ఎరువుల పరిశ్రమ పునరుద్ధరణకు వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేశామని..గతేడాది పరిశ్రమ తిరిగి ప్రారంభం అయిందని గుర్తు చేశారు.
ఐతే మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్ కలిసి దాదాపు 800 మంది నిరుద్యోగుల నుంచి రూ. 6 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేసి తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చారని లేఖలో తెలిపారు. ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తామని..అవసరం అనుకుంటే ఆ ఉద్యోగాన్ని వేరే వాళ్లకు అమ్ముకోవచ్చని బాధితులకు నమ్మబలికారన్నారు. ఉద్యోగాల నియామకంలో దాదాపు రూ. 50 కోట్లు చేతులు మారాయని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
ఈనేపథ్యంలోనే ఇటీవల రామగుండం ఉద్యోగాల నియామక కాంట్రాక్ట్ మారిందని..వారు గతంలో నియమించిన వారిలో సగం మందిని తొలగించారని పేర్కొన్నారు. ఇప్పుడు బాధితులంతా ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్నారని చెప్పారు. ఈక్రమంలోనే తీవ్రంగా మానసిక ఆందోళన గురై కేశవపట్నం మండలం అమ్మలపురానికి చెందిన హరీష్ అనే యువకుడు సెల్ఫీ వీడియో పెట్టి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని లేఖలో సీఎం దృష్టికి తీసుకొచ్చారు రేవంత్‌రెడ్డి.
రేపు రామగుండానికి సీఎం కేసీఆర్ వెళ్తున్నారని..పోస్టుమార్టం చేసే ఆస్పత్రిని సైతం మార్చారని విమర్శించారు. వీటిపై ఇప్పటికీ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పట్టించుకోవడం లేదని లేఖలో మండిపడ్డారు. ఈఅంశంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తక్షణమే మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్‌ను బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారని గుర్తు చేశారు.
వెంటనే వారిని విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో డిమాండ్ చేశారు రేవంత్‌రెడ్డి. ఉద్యోగాల నుంచి తీసేసిన వారిని వెంటనే తీసుకోవాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న హరీష్ కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకోవాలని చెప్పారు. తక్షణమే వారికి రూ.50 లక్షల నష్ట పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also read:JP NADDA MEETING LIVE UPDATES: బీజేపీలోకి క్రికెటర్ మిథాలీ రాజ్! జేపీ నడ్డాతో కీలక సమావేశం..
Also read:CJI Tenure: సీజేఐగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్..అతి తక్కువ కాలం పని చేసిన న్యాయమూర్తులు వీరే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి