కర్ణాటకలో హంగ్ వస్తుందని విశ్లేషకుల వ్యాఖ్యలు
కర్ణాటక ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా వెళ్లే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా వెళ్లే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం వస్తున్నట్లు కనిపించకపోవడమే అందుకు కారణం. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కచ్చితంగా 112 సీట్లు పొందాల్సిన తరుణంలో.. బీజేపీ దాదాపు 105 సీట్లే కైవసం చేసుకొనే విధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రస్తుత సమాచారం ప్రకారం బీజేపీ 58 స్థానాల్లో గెలుపొంది.. 47 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ మాత్రం 23 స్థానాల్లో గెలుపొంది 52 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. జేడీఎస్ 11 స్థానాల్లో గెలుపొంది.. 28 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాబట్టి ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ వస్తున్నట్లు కనిపించడం లేదు. కాబట్టి జేడీఎస్ ఎవరి వైపుకి మొగ్గుతుందో ఆ పార్టీయే పీఠాన్ని అధిరోహించే అవకాశం ఉంది.