Prashant kishor: సక్సెస్ ఫుల్ ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయనని..విశ్రాంతి కావాలని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు( West Bengal Assembly Elections Results) వెలువడ్డాయి. మమతా బెనర్జీ ( Mamata Banerjee) ముచ్చటగా మూడోసారి విజయం సాధించారు. బెంగాల్ కోటపై కాషాయజెండా ఎగురవేయాలన్న బీజేపీ(Bjp)ఆశలు ఆవిరయ్యాయి. ఈ నేపధ్యంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను ఎన్నికల వ్యూహకర్త పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.


ఇక తాను చేస్తున్న పనిని కొనసాగించలేనని స్పష్టం చేశారు. జాతీయ మీడియా సమక్షంలో ప్రశాంత్ కిషోర్ ( Prashant kishor) తన నిర్ణయాన్ని వెల్లడించారు. బెంగాల్ గెలిచింది. చేయగలిగినంత చేశాను. కొద్దికాలం విశ్రాంతి తీసుకుని జీవితంలో మరేదైనా చేయాలనుకుంటున్నానని చెప్పారు. మరోసారి రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారా అనే ప్రశ్నకు తాను రాజకీయాల్లో విఫలమయ్యానని తెలిపారు.


విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ప్రశాంత్ కిశోర్ ఈ నిర్ణయం తీసుకున్నారా లేదా గతంలో తాను చేసిన ట్వీట్ ఛాలెంజ్ గుర్తొచ్చిందా అనే వాదన విన్పిస్తోంది. ఎందుకంటే టీఎంసీ (TMC) 2 వందల సీట్లు దాటుతుందని ట్వీట్ చేసిన ప్రశాంత్ కిశోర్..అది సాధించారు. అయితే అదే సమయంలో బీజేపీ డబుల్ డిజిట్ దాటడం కష్టమేనని..ఒకవేళ బీజేపీ(Bjp)మెరుగైన ఫలితం సాధిస్తే తాను తన వృత్తి నుంచి వైదొలగుతానని కూడా ట్వీట్ చేశారు.  ఈ ట్వీట్ నేపధ్యంలోనే ప్రశాంత్ కిశోర్ ఇప్పుడీ నిర్ణయం తీసుకున్నారనే వాదన వస్తోంది. 


Also read: West Bengal Assembly Elections Results live Update: బెంగాల్ పీఠంపై ముచ్చటగా మూడోసారి దీదీ ప్రభుత్వం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook