లక్నో: ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే తన అనుచరులతో కలిసి 8 మంది పోలీసులపై కాల్పులు జరిపిన కేసులో పోస్టుమార్టం నివేదిక దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. పోలీసులను చంపేందుకు దుండగులు పదునైన ఆయుధాలు వాడినట్లు తేలింది. అతి సమీపం నుంచి కాల్చడంతో వారి శరీరం నుంచి బుల్లెట్లు దూసుకెళ్లినట్లు పోస్టుమార్టం నివేదిక తేల్చింది.  AP: ఆ ప్రాంతాల్లో లాక్‌డౌన్ కొనసాగింపు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వికాస్ దుబే(Vikas Dubey)ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు కాన్పూర్‌లోని బిక్రూ గ్రామానికి వెళ్లగా.. దీనిపై ముందే సమాచారం అందుకున్న దుబే తన అనుచరులతో కలిసి ప్లాన్ ప్రకారం దాడి చేసి, విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో 8 మంది పోలీసులు చనిపోవడం తెలిసిందే. అయితే పోలీసులపై పదునైన మారణాయుధాలతోనూ దాడిచేశారని స్పష్టమైంది. ముఖ్యంగా పోలీసు అధికారి దేవేంద్ర మిశ్రాను అతి కిరాతకంగా హత్య చేశారని తెలుస్తోంది. దేవేంద్ర మిశ్రాపై నాలుగు రౌండ్లు కాల్పులు జరపడంతో పాటు పదునైన ఆయుధాలతో నిందితులు దాడి జరిపారు. కరోనా మళ్లీ మళ్లీ సోకవచ్చు.. రీసెర్చ్‌లో షాకింగ్ విషయాలు


దేవేంద్ర మిశ్రాకు నాలుగు బుల్లెట్లు తాకగా.. శరీరం నుంచి మూడు బుల్లెట్లు బయటకు దూసుకెళ్లాయంటే అతి సమీపం నుంచి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. రెండు బుల్లెట్లు కడుపులో, ఒకటి ఛాతీలోకి వెళ్లగా.. తలలో మరో బుల్లెట్ ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక చెబుతోంది. ఇవన్నీ పరిశీలిస్తే కేవలం తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసుల నుంచి తప్పించుకోవడం కన్నా.. ప్రతీకారం కోసం చేసిన చర్యగా కనిపిస్తుందని పోలీసులు భావిస్తున్నారు.  వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్


సీవో దేవేంద్ర మిశ్రాను కాల్చిన అనంతరం అతడి కాలును పదునైన ఆయుధంతో తొలగించడం గమనార్హం. ముగ్గురు పోలీసులకు తలపై బుల్లెట్లు ఉండగా, ఒకరికి ముఖంపై బుల్లెట్ ఉన్నాయంటే దారుణంగా హత్యచేశారని తెలుస్తోంది. కాగా, వారంరోజుల అన్వేషణ తర్వాత ఉజ్జయినీలో పట్టుబడ్డ నిందితుడు వికాస్ దుబేను కాన్పూరుకు తీసుకొస్తుండగా పారిపోవడానికి యత్నిస్తే పోలీసులు కాల్పులు జరపడంతో హతమయ్యాడు. 


ఈ కేసులో వికాస్ దుబే అనుచరులు ఒక్కొక్కరిని పోలీసులు దేశ వ్యాప్తంగా టీమ్‌లు ఏర్పడి దాడులు జరుపుతున్నారు. కొందరు ఇదివరకే ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. పోలీసుల హత్య కేసుకు సంబంధించిన కేసుపై నియమించిన విచారణ కమిషన్‌కు రిటైర్డ్ జస్టిస్ శశికాంత్ అగర్వాల్ నేతృత్వం వహిస్తున్నారు. పోలీసులను అతిదారుణంగా చంపడంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..