Pradhan Mantri Awas Yojana: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన PMAYపై Budget 2021లో గుడ్ న్యూస్
Pradhan Mantri Awas Yojana Scheme Latest News | సామాన్యుడి సొంతింటి కలకు ఆశలు చేకూర్చే పథకం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన. దీనిలో భాగంగా దరఖాస్తుదారులకు కొంత మేర రుణాలపై సబ్సిడీ లభిస్తుంది. తాజాగా కేంద్ర బడ్జెట్ 2021లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.
Pradhan Mantri Awas Yojana Scheme: సామాన్యులు సైతం సొంత గృహాలు ఏర్పాటు చేసుకోవడం, లేక ఇళ్లు కొనుగోలు చేసే స్థోమతను పెంచడానికి గతంలో తీసుకొచ్చిన పథకం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(PMAY). రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకున్న నేపథ్యంలోనూ సామాన్యులకు ఊరట కలిగించే వార్తను అందించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని మరో ఏడాదిపాటు పొడిగించారు. మార్చి 31, 2022 వరకూ గృహాల కొనుగోలుపై కేంద్రం ప్రకటించిన రాయితీలను సామాన్యులు పొందవచ్చు. తన బడ్జెట్ 2021 ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ప్రకటించారు. కేంద్రం నిర్ణయంపై సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ పక్కా ఇళ్లు అనే లక్ష్యంతో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(Pradhan Mantri Awas Yojana) పథకాన్ని కేంద్రం ప్రారంభించడం తెలిసిందే.
సబ్సిడీ లింక్ గృహ రుణ పథకం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PMAY Latest Updates)ను పొందాలంటే హోమ్ లోన్(Home Loan Latest News)కు దరఖాస్తు చేసుకున్నప్పుడే బ్యాంకులో వివరాలు తెలుసుకుని అప్లై చేయాలి. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్(CLSS)ను 2017లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. ఈ పథకం కింద హోమ్ లోన్లపై రూ.2.30 లక్షల వరకు రాయితీ పొందవచ్చు.
Also Read: Budget 2021: కరోనా వ్యాక్సిన్ కోసం Budget 2021లో భారీ కేటాయింపులు, వైరల్ ల్యాబ్‌లు
గతానికి భిన్నంగా ఈ ఏడాది స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా కాగిత రహితపు బడ్జెట్ 2021(Paperless Budget 2021)ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. గతేడాది నుంచి బ్రీఫ్‌కేస్ సంప్రదాయానికి సైతం స్వస్తి పలికారు. వరుసగా రెండో ఏడాది ఎర్ర రంగు బ్యాగులో బడ్జెట్‌ను తీసుకొచ్చారు.
Also Read: Budget Expectations 2021: బడ్దెట్‌లో దేనికి ప్రాధాన్యత..నిర్మలా సీతారామన్ ఏమన్నారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook