Prashant Kishor into Politics: ప్రశాంత్ కిశోర్ తన భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇచ్చేశారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లాల్సిన సమయం వచ్చేసిందంటూ ట్వీట్ చేశారు. దీంతో తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు స్పష్టం చేసినట్లయింది. అంతేకాదు, త్వరలోనే పీకే కొత్త పార్టీ పెడుతారనే ప్రచారానికి ఈ ట్వీట్ బలం చేకూర్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన పాత్ర పోషించాలనే తపనతో ప్రజాపక్ష విధానాల రూపకల్పనలో పదేళ్ల ఒడిదుడుకుల ప్రయాణం చేశాను. ఈ ప్రయాణంలో మరో పేజీ తిప్పుతున్న తరుణంలో నిజమైన మాస్టర్స్ అయిన ప్రజల సమస్యలను అర్థం చేసుకునేందుకు... సుపరిపాలన మార్గం కోసం నేరుగా ప్రజల వద్దకే వెళ్తున్నాను..' అని ప్రశాంత్ కిశోర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 


ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రశాంత్ కిశోర్ తన ప్రస్థానాన్ని బీహార్ నుంచే ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఇప్పటికే పీకే సుదీర్ఘ మేధో మదనం జరుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రత్యక్ష రాజకీయాలపై తేల్చేసిన పీకే... ఇక త్వరలోనే కొత్త పార్టీపై కూడా స్పష్టతనిచ్చే అవకాశం లేకపోలేదు.


ఇన్నాళ్లు ఎన్నికల వ్యూహకర్తగా ఆయా రాజకీయ పార్టీల గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు స్వయంగా ప్రత్యక్ష రాజకీయాల్లో దిగుతుండటం దేశ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. పీకే కాంగ్రెస్‌లో చేరుతారంటూ నిన్న, మొన్నటిదాకా జోరుగా సాగిన ప్రచారానికి పీకే చివరి నిమిషంలో చెక్ పెట్టేశారు. కాంగ్రెస్‌లో చేరట్లేదని క్లారిటీ ఇచ్చేసిన ఆయన... రాజకీయాల్లో సొంతంగా అడుగులు వేసేందుకు కదులుతున్నారు. పీకే అడుగులు ఏ దిశగా ఉండబోతున్నాయన్న దానిపై మున్ముందు మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 



Also Read: Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ బిగ్ అనౌన్స్‌మెంట్... సొంత రాజకీయ పార్టీపై నేడే ప్రకటన...


Also Read: Weather Report: మండే ఎండల్లో.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook