Precaution Dose Service Charge: మొదటి, రెండో డోసులకు ఏ కోవిడ్ వ్యాక్సిన్ అయితే ఇచ్చారో ప్రికాషనరీ డోసుగా అదే వ్యాక్సిన్ ఇస్తారని కేంద్రం స్పష్టం చేసింది. ప్రైవేట్ కేంద్రాల్లో ఇచ్చే ప్రికాషనరీ డోసుకు సర్వీస్ ఛార్జీగా ఒక్కో డోసుకు గరిష్టంగా రూ.150 వరకు వసూలు చేస్తారని తెలిపింది. దీంతో సర్వీస్ చార్జిగా అంతకుమించి వసూలు చేయకూడదని స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లయింది. ప్రికాషన్ డోసు పంపిణీ విధి విధానాలపై శనివారం (ఏప్రిల్ 9) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ కార్యదర్శులతో జరిగిన సమావేశంలో కేంద్రం ఈ విషయాలు వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో 18 ఏళ్లు నిండినవారందరికీ ప్రైవేట్ కేంద్రాల ద్వారా ప్రికాషన్ డోసు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 10 నుంచి ప్రికాషన్ డోసు పంపిణీ జరగనుంది. 18 ఏళ్లు నిండినవారు... వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుని 9 నెలలు పూర్తయినవారు ప్రికాషన్ డోసుకు అర్హులుగా కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ప్రికాషన్ డోసు పంపిణీ విధివిధానాలపై కేంద్రం ఇవాళ రాష్ట్రాలతో చర్చించింది.


ఇకపోతే కోవీషీల్డ్ ప్రికాషన్ డోసు ధరను సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూ.600గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ధర మరీ ఎక్కువగా ఉందన్న విమర్శలు రావడంతో సీరమ్ ఇనిస్టిట్యూట్ వెనక్కి తగ్గింది. ప్రికాషన్ డోసు ధరను రూ.225కి తగ్గించింది. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడినవారికి, ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు మాత్రమే కేంద్రం ఉచితంగా ప్రికాషన్ డోసు అందిస్తోంది. 18 ఏళ్లు పైబడినవారు ప్రైవేట్ కేంద్రాల్లోనే ప్రికాషన్ డోసు టీకాను వేయించుకోవాల్సి ఉంటుంది. 


Also Read: Renault offers: రెనో కార్లపై అదిరే ఆఫర్లు.. రూ.1.1 లక్షల వరకు డిస్కౌంట్లు


Aadhar Download: మొబైల్ నంబరు లేకుండానే ఇకపై ఆధార్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook