Renault offers: కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఆటోమొబైల్ సంస్థలు కూడా విక్రయాల పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో 2022-23లోనైనా మంచి విక్రయాలు సాధించాలని భావిస్తున్నాయి. ఇందుకోసం భారీ ఆఫర్లు ప్రకటించి విక్రయాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఫ్రాన్స్‌కు చెందిన రెనో.. డిస్కౌంట్లతో పాటు.. ఎక్స్ఛేంజ్ బోనస్, లాయలిటీ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ల వంటివి ఇస్తోంది. ఆ డిస్కౌంట్ల వివరాలు ఉళా ఉన్నాయి.
మోడళ్ల వారీగా డిస్కౌంట్లు..
రెనో క్విడ్: బడ్జెట్ రేంజ్ కారు క్విడ్‌పై రూ.10 వేలు (అప్‌గ్రేడ్ వెర్షన్‌పై రూ.5 వేలు). ఇస్తోంది. దీనితో పాటు లాయాలిటీ బోనస్ కింద రూ.38 వేలు ప్రకటించింది. 0.8 లీటర్ పెట్రోల్ వెర్షన్‌పై రూ.10 వేల ఎక్స్ఛేంజ్ బోనస్.. 1.0 లీటర్ పెట్రోల్ వెర్షన్‌పై రూ.15 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోలస్ ఇస్తోంది.
రెనో ట్రైబర్, కిగర్..
రెనో ట్రైబర్ మోడల్‌పై రూ.10 వేల వరకు తక్షణ డిస్కౌంట్ ఇస్తోంది. ఎక్స్ఛేంజ్ ఇన్సెంటివ్ కింద రూర.20 వేలు, లాయాలిటి బెనిఫిట్ కింద రూ.44 వేల వరకు తగ్గింపు ఇస్తోంది రెనో. రోనా కిగర్పై మోడల్‌పై డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్పై ఇన్సెంటివ్‌లు లేవు. కానీ లాయాలిటి బెనిఫిట్ కింద రూ.55,000 వరకు తగ్గింపు ఇస్తోంది.
రెనో డస్టర్..
రెనోలో బెస్ట్ సెల్లర్ ఎక్స్యూవీపై రికార్డు స్థాయిలో ఆఫర్ ప్రకటించింది. క్యాష్ డిస్కౌంట్ కింద రూ.50 వేలు, ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.50 వేలు ఇస్తోంది కంపెనీ. లాయాలిటీ బెనెఫిట్స్ ద్వారా మరో రూ.1.1 లక్షల వరకు తగ్గింపు పొందొచ్చు.
ఈ ఆఫర్లన్నింటితో పాటు కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.30 వేలు (డస్టర్‌కు మాత్రమే) ఇస్తోంది రెనో. ఇతర అనఅని మోడళ్లకు రూ.15 వల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిసింది. వీటన్నింటితో పాటు.. స్క్రాపింగ్ బోనస్ కింద రూ.10 వేల ఇస్తోంది రెనో.
నోట్: రెనో అందిస్తున్న ఈ ఆఫర్లు డీలర్లు, ప్రాంతాలను బట్టి మారుతాయి.
Also read: Indian Railways Concession: సీనియర్ సిటిజన్స్ కు గుడ్ న్యూస్.. రైలు ప్రయాణాలపై రాయితీ!
Also read: Tata Nexon EV: టాటా నెక్సాన్ ఈవీ కారు.. ఒక్కసారి చార్జింగ్‌తో 400 కిమీ.. మరెన్నో కొత్త ఫీచర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook