2024 Elections Surveys: సాధారణ ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ వివిధ సంస్థల సర్వేలు అధికమౌతున్నాయి. మొన్న టైమ్స్ నౌ సర్వే..ఇప్పుడు ఎన్డీటీవీ-సీఎస్డీఎస్ సర్వే. ఈసారి 2024లో అధికారం ఎవరిదనే విషయంపై ఆ సర్వేలు దాదాపుగా తేల్చి చెప్పేశాయి. ఎంతమంది ఎటువైపు మొగ్గు చూపుతున్నారనేది వెల్లడైంది. సర్వే పూర్తి వివరాలు మీ కోసం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏప్రిల్ నెలలో టైమ్స్ నౌ చేసిన సర్వే ప్రకారం 2024లో కూడా మరోసారి మోదీ సారధ్యంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో వస్తుందని దాదాపుగా తేలింది. అప్పట్నింటి విపక్షాలు ఆందోళనలో పడ్డాయి. ఈసారి ఎలాగైనా బీజేపీని గద్దె దించాలనే ఆలోచనతో అన్ని విపక్షాలు ఏకమయ్యాయి. ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఈలోగా మే నెలలో మరో సంస్థ చేసిన సర్వే ఫలితాలు కూడా ఇండియా కూటమిని జీర్ణించుకోలేకుండా చేస్తున్నాయి. ప్రముఖ టీవీ ఛానెల్ ఎన్డీటీవీ సీఎస్డీఎస్ సంస్థతో కలిపి చేసిన సర్వేలో ప్రధానిగా నరేంద్ర మోదీకు అత్యధికంగా 43 శాతం మంది పట్టం కట్టారు. ఎన్డీటీవీ-సీఎస్డీఎస్ సర్వే ప్రకారం రాహుల్ గాంధీకు గతం కంటే ఆదరణ పెరిగింది. ఈసారి రాహుల్ గాంధీకు 27 శాతం మంది మద్దతుగా నిలిచారు. మోదీ 9 ఏళ్ల హయాంలో పెద్దగా అవినీతి ఆరోపణలు లేకపోవడం ఎన్డీయేకు కలిసొచ్చిన అంశంగా ఎన్డీటీవీ-సీఎస్డీఎస్ అభిప్రాయపడింది. 


ఇక మమతా బెనర్డీ, అరవింద్ కేజ్రీవాల్‌లలో ప్రధానిగా ఎవరు అర్హులనే ప్రశ్నకు చెరో 4 శాతం మంది మద్దతు పలికారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు 3 శాతం మద్దతు లభించింది. ఇక్కడ గమనించాల్సిన అంశమేమంటే..రాహుల్ గాంధీకు 2019తో పోలిస్తే 3 శాతం మద్దతు పెరిగింది. ఇక నరేంద్ర మోదీకు 2019తో పోలిస్తే 1 శాతం తగ్గింది. 


ఇక ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్‌లో 2024 ఎన్నిక్లో ఎన్డీయే కూటమికి 318 స్థానాలు లభిస్తాయని అంచనా ఉంది. ఇక ప్రతిపక్షాల కూటమికి 175 సీట్లు లభించనున్నాయి. ఇతరులకు మరో 50 సీట్ల వరకూ రావచ్చు. ఎన్డీటీవీ-సీఎస్డీఎస్ సర్వేలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. మోదీ ఎందుకు ఇష్టం అనే ప్రశ్నకు అత్యధికంగా 25 శాతం మంది మంచి నేత అని సమాధానమిస్తే..అభివృద్ధికి 20 శాతం ఓటేశారు. ఇక రాహుల్ గాంధీ ఎలాగుంటారనే ప్రశ్నకు చాలా ఇష్టమని 26 శాతం సమాధానం చెబితే..మంచి వ్యక్తి-చెడు వ్యక్తి రెండూ కాదని 27 శాతం సమాధానమిచ్చారు. ఇష్టం లేదని మాత్రం కేవలం 16 శాతమే చెప్పారు. మరో 16 శాతం మంది ఏ సమాధానం చెప్పలేదు. 


బీజేపీ బలాన్ని తగ్గించేందుకే కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ కలిపి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమలో 26 పార్టీలున్నాయి. ఈసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి అధికారం లభించినా విజయం అంత సులభంగా రాదని సర్వే సంస్థలు తేల్చాయి. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో లేకపోవడమే కాకుండా బలం పుంజుకోలేని పరిస్థితుల్లో ఉండటం మరో కారణం. ఉత్తరాదిలో ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంటే..పశ్చిమ బెంగాల్, బీహార్, రాజస్థాన్, ఒడిశా, జార్ఘండ్ రాష్ట్రాల్లో ప్రతిపక్షం అధికారంలో ఉంది.


Also read: Manipur violence: మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస.. ముగ్గురు మృత్యువాత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook