President Droupadi Murmu address to Nation on Republic Day 2023: 'మనమంతా ఒక్కటే.. మనమంతా భారతీయులం. ఎన్నో మతాలు, ఇన్ని భాషలు మనల్ని విభజించలేదు కానీ మనల్ని ఏకం చేశాయి. అందుకే మనం ప్రజాస్వామ్య గణతంత్రంగా విజయం సాధించాం. ఇది భారతదేశ సారాంశం..' అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం సాయంత్రం జాతిని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. దేశప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగాన్ని ప్రారంభించారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ విదేశాల్లో నివసిస్తున్న భారత ప్రజలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని రాష్ట్రపతి అన్నారు. రాజ్యాంగ నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పేదలు, నిరక్షరాస్యులు అనే స్థితి నుంచి అభివృద్ధిలో దూసుకుపోతున్న మన దేశం.. ప్రపంచ వేదికపై ఆత్మవిశ్వాసంతో కూడిన దేశంగా నిలిచిందని అన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాజ్యాంగ నిర్మాతల సమష్టి విజ్ఞత నుంచి మార్గదర్శకత్వం లేకుండా ఈ పురోగతి సాధ్యం కాదన్నారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి నాయకత్వం వహించి, దానిని ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు భారతదేశం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందన్నారు. ప్రాథమిక ముసాయిదాను రూపొందించిన న్యాయనిపుణుడు బీఎన్ రావు, రాజ్యాంగాన్ని రూపొందించడంలో సహకరించిన ఇతర నిపుణులు, అధికారుల పాత్రను కూడా మనం గుర్తుంచుకోవాలని అన్నారు.  


కోవిడ్-19 గురించి ప్రస్తావిస్తూ.. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ చాలా నష్టపోయిందని రాష్ట్రపతి అన్నారు. కరోనాతో భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. గతేడాది భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో మన దేశం విజయం సాధించిందని అన్నారు. సమర్థ నాయకత్వం, సమర్థవంతమైన పోరాటం సహాయంతో మాంద్యం నుంచి త్వరగా బయటపడి.. అభివృద్ధి ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించామన్నారు. ప్రభుత్వం సకాలంలో చొరవ చూపడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. 


21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేందుకు విద్యార్థులను సన్నద్ధం చేస్తూనే జాతీయ విద్యా విధానం మన నాగరికతపై ఆధారపడిన విజ్ఞానాన్ని సమకాలీన జీవితానికి అనుగుణంగా మారుస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మనం సాధించిన విజయాల పట్ల గర్వంగా భావించవచ్చు. అంతరిక్ష సాంకేతికత రంగంలో మన దేశం కొన్ని ప్రముఖ దేశాలలో ఒకటిగా ఉంది. భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు గగన్‌యాన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇది భారతదేశపు తొలి మానవ సహిత అంతరిక్ష విమానం. 


మహిళా సాధికారత, స్త్రీ పురుషుల మధ్య సమానత్వం అనేవి కేవలం నినాదాలు కాదు. రేపటి భారతదేశాన్ని రూపుమాపడంలో మహిళలు అత్యధికంగా కృషి చేస్తారనడంలో సందేహం లేదు. ఈ సాధికారత దృక్పథం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలతో సహా బలహీన వర్గాల ప్రజల కోసం ప్రభుత్వం మార్గనిర్దేశం చేస్తుంది. ఈ ఏడాది జి-20 దేశాల గ్రూప్‌కు భారత్ అధ్యక్షత వహిస్తోంది. సార్వత్రిక సోదరభావం మా ఆదర్శానికి అనుగుణం.. మేము అందరికీ శాంతి, శ్రేయస్సు కోసం నిలబడతాం. మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడంలో భారత్‌కు జి-20 అధ్యక్ష పదవి చాలా ముఖ్యమైన పాత్రను అందిస్తుంది. 


ఐక్యరాజ్యసమితి భారతదేశ సూచనను అంగీకరించి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించింది. ఎక్కువ మంది ప్రజలు ముతక ధాన్యాలను ఆహారంలో చేర్చుకుంటే పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. “జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్” స్ఫూర్తితో మన దేశం ముందుకు సాగడానికి సామూహిక బలంతో కూడిన రైతులు, కార్మికులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల పాత్రను నేను అభినందిస్తున్నాను. దేశ ప్రగతికి సహకరించిన ప్రతి పౌరుడిని అభినందిస్తున్నాను. మన సరిహద్దులను కాపాడుతూ.. ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండే వీర సైనికులను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దేశప్రజలకు అంతర్గత భద్రత కల్పిస్తున్న అన్ని పారా మిలటరీ బలగాలు, పోలీసు బలగాల వీర సైనికులను కూడా నేను అభినందిస్తున్నాను. అందమైన పిల్లలందరి ఉజ్వల భవిష్యత్తు కోసం నేను హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను..' అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
 
ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా ఎల్‌సీసీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయనతో పాటు ఐదుగురు మంత్రులు, సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి బృందం కూడా ఉంటుంది. భారత్, ఈజిప్ట్ దేశాలు దౌత్య సంబంధాలను స్థాపించి 75 సంవత్సరాలను జరుపుకుంటున్నాయి. భారత్ జీ20 అధ్యక్షత వహించిన సమయంలో ఈజిప్టును 'అతిథి దేశం'గా కూడా ఆహ్వానించారు. ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకల థీమ్ 'జన్-భాగిదారి' (ప్రజల భాగస్వామ్యం), ఇది దేశ సాంస్కృతిక వారసత్వం, గొప్ప సంప్రదాయాన్ని ప్రదర్శిస్తుంది.


Also Read: Nara Lokesh: మాటలకందని భావోద్వేగాలు.. అమ్మానాన్నలకు పాదాభివందనం: నారా లోకేష్ ఎమోషనల్  


Also Read: Pawan Kalyan: పవన్ పర్యటనలో 108 అంబులెన్స్ సైరన్.. వెంటనే వాహనాలు నిలిపివేసి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook