Central Universities: దేశవ్యాప్తంగా యూనివర్సిటీలకు కొత్త వైస్ ఛాన్సలర్ల నియామకం పూర్తయింది. దేశంలోని 12 యూనివర్శిటీల వీసీల నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో గత కొద్దికాలంగా కొన్ని యూనివర్సిటీలకు వైఎస్ ఛాన్సలర్ల (Vice Chancelors)నియామకం జరగాల్సి ఉంది. మొత్తం 12 వర్శిటీలకు కొత్త వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ సిద్ధమైన ఉత్తర్వులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిడ్ ఆమోదం తెలిపారు.సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము, జార్ఘండ్, కర్ణాటక, తమిళనాడు, దక్షిణ బీహార్, మణిపూర్ విశ్వ విద్యాలయం, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ, నార్త్-ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ, బిలాస్‌పూర్ ఘాసిదాస్ విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించారు. దేశంలోని సెంట్రల్ యూనివర్శిటీల్లో మొత్తం 22 వీసీ పోస్టులు ఖాళీగా ఉండగా..12 పోస్టులకు రాష్ట్రపతి రామ్‌నా‌థ్ కోవింద్ (Ramnath Kovid) ఆమోదం తెలిపారు.ఇప్పటికీ దేశంలో పూర్తి స్థాయి వీసులు లేకుండా బనారస్ హిందూ యూనివర్శిటీ, ఢిల్లీ యూనివర్శిటీ, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.


ప్రొఫెసర్ తంకేశ్వర్ కుమార్                            హర్యానా సెంట్రల్ యూనివర్శిటీ
ప్రొఫెసర్ సత్‌ప్రకాష్ బన్సాల్                        హిమాచల్ ప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీ
డాక్టర్ సంజీవ్ జైన్                                           జమ్ము సెంట్రల్ యూనివర్శిటీ
ప్రొఫెసర్ బట్టు సత్యనారాయణ                      కర్ణాటక యూనివర్శిటీ
క్షితి భూషణ్ దాస్                                           జార్ఘండ్ సెంట్రల్ యూనివర్శిటీ
ప్రొఫెసర్ ముత్తుకలింగన్ కృష్ణన్                     తమిళనాడు సెంట్రల్ యూనివర్శిటీ
డాక్టర్ బసుత్కర్ జే రావు                                  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ
ప్రొఫెసర్ కామేశ్వర్ నాత్ సింగ్                        దక్షిణ బీహార్ సెంట్రల్ యూనివర్సిటీ
ప్రొఫెసర్ ఎన్ లోకేంద్ర సింగ్                           మణిపూర్ యూనివర్శిటీ
డాక్టర్ అలోక్ కుమార్ చక్రవల్                         గురు ఘాసిదాస్ యూనివర్శిటీ
ప్రొఫెసర్ ప్రభాశంకర్ శుక్లా                               నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ
ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్                     మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్శిట


Also read: National Education Policy: జాతీయ విద్యా విధానంలో ఏపీ నెంబర్ వన్ స్థానం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook