Chief Election Commissioner: కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చీఫ్‌గా రాజీవ్ కుమార్ నియామకం
Next Chief Election Commissioner: ఈ నెల 15న కేంద్రం ఎన్నికల సంఘం చీఫ్ సుశీల్ చంద్ర రిటైర్ అవుతున్న నేపథ్యంలో ఆయన స్థానంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు.
Next Chief Election Commissioner: కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చీఫ్‌గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, క్లాజ్ (2)ని అనుసరించి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ రాజీవ్ కుమార్‌ను కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్‌గా నియమించారు. ఈ నెల 15న రాజీవ్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ సుశీల్ చంద్ర ఈ నెల 14న రిటైర్ అవనున్నారు. రాజీవ్ కుమార్ నియామకంపై కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి బిశ్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాజీవ్ కుమార్ 1984 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి. 37 సంవత్సరాల పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. బ్యాంకింగ్, ఎన్విరాన్‌మెంట్, సోషల్, హ్యూమన్ రిసోర్స్, ఫారెస్ట్ ఇలా తదితర రంగాల్లో ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డు డైరెక్టర్‌గా, ఎస్‌బీఐ, నాబార్డ్ డైరెక్టర్‌గా, ఎకనమిక్ ఇంటలిజెన్స్ కౌన్సిల్ సభ్యుడిగా, బ్యాంక్ బోర్డు మెంబర్‌గా, సివిల్ సర్వీసెస్ బోర్డు మెంబర్‌గా, పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ సెలక్షన్ బోర్డు ఛైర్మన్‌గా సేవలందించారు.
రాజీవ్ కుమార్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఫిబ్రవరి , 2020లో ఐఏఎస్‌గా రిటైర్డ్ అయ్యారు. సెప్టెంబర్ 1, 2020న కేంద్ర ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. సీనియారిటీ పరంగా కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చీఫ్‌గా ఆయనకు అవకాశం దక్కింది. కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చీఫ్‌గా నియమించబడినందుకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు రాజీవ్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
Also Read: Telangana Weather Report: తెలంగాణ వాతావరణ హెచ్చరిక.. రానున్న 3 రోజులూ వర్షాలే!
Also Read: Sarkaru Vaari Paata Review: మహేష్ బాబు 'సర్కారు వారి పాట' రివ్యూ... సినిమా ఎలా ఉందంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook