Telangana Weather Report: తెలంగాణ వాతావరణ హెచ్చరిక.. రానున్న 3 రోజులూ వర్షాలే!

Telangana Weather Report: రానున్న 3 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలోని వాయుగుండం తెలంగాణ మీదుగా పశ్చిమ విదర్భ వైపుగా వస్తున్న క్రమంలో అక్కడక్కడ చెదురుమదురు వానలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 12, 2022, 01:37 PM IST
Telangana Weather Report: తెలంగాణ వాతావరణ హెచ్చరిక.. రానున్న 3 రోజులూ వర్షాలే!

Telangana Weather Report: బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ నిన్న (మే 11) వాయుగుండంగా మారింది. ఇది తెలంగాణ మీదుగా పశ్చిమ విదర్భ వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈరోజు బలహీన పడింది. ఆ తర్వాత అది అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. 

రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ కేంద్ర సంచాలకులు పేర్కొన్నారు. 

Also Read: CM Kcr Stategy: సీఎం కేసీఆర్‌కు ఆ ముచ్చట తీరుతుందా..?

Also Read: Cashier Theft Bank Cash: బెట్టింగ్ లో వస్తే వస్తా.. లేదంటే చస్తా!బ్యాంక్ నగదు చోరీ కేసులో క్యాషియర్ ట్విస్ట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News