Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో 99.18 శాతం పోలింగ్ నమోదైంది. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 4796 మంది సభ్యులు ఉండగా 99 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంట్‌లో మొత్తం 721 మంది ఎంపీలు,9 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ సహా 9 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకోలేదు. గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కేరళ, కర్ణాటక, మణిపూర్, మధ్యప్రదేశ్, మిజోరం, పుదుచ్చేరి, సిక్కీం, తమిళనాడు రాష్ట్రాల్లో 100 శాతం పోలింగ్ నమోదైంది. పార్లమెంట్‌లో ఎంపీలు, అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలు ఓటు వేశారు. కొందరు ఎంపీలు సొంత రాష్ట్రాల్లోనే ఓటు వేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈసారి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ భారీగానే జరిగినట్లు తెలుస్తోంది. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీల నేతలు క్రాస్ ఓటింగ్ వేసినట్లు చెబుతున్నారు. అస్సాంలో 20 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కి పాల్పడినట్లు ఏఐడీయుఎఫ్ ఎమ్మెల్యే కరీముద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ బిష్ణోయ్ కూడా ద్రౌపది ముర్ముకే ఓటు వేశారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ఎమ్మెల్యే సీతక్క కూడా క్రాస్ ఓటింగ్ చేశారనే ప్రచారం జరుగుతోంది. 


తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, మంత్రి గంగుల కమలాకర్ ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఏపీలో నందమూరి బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి ఓటు హక్కు వినియోగించుకోలేదు. తెలంగాణలో 98.33 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రానికి చెందిన 117 మంది ఎమ్మెల్యేలు,ఏపీ నుంచి ఒక ఎమ్మెల్యే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏపీలో 175 మంది ఎమ్మెల్యేలకు గాను 173 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నెల 21న రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్, ఫలితాల వెల్లడి ఉంటుంది. ఈ నెల 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేస్తారు. 


Also Read: Neet Dress Code: నా కూతురి లోదుస్తులు విప్పించారు.. నీట్ పరీక్షలో డ్రెస్ కోడ్‌పై పోలీసులకు ఓ తండ్రి ఫిర్యాదు..


Also Read: Horoscope Today July 19th: నేటి రాశి ఫలాలు.. ఈ 3 రాశుల వారికి ఇవాళ శుభదినం...



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook