PresVu Eyedrops: భారతీయ డ్రగ్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ ఒక కొత్త కంటి చుక్కల మందును ఆమోదించింది. దీంతో ఇక మనకు కంటి అద్దాల అవసరమే ఉండదు. ముఖ్యంగా కళ్లు మసకగా కనిపించే సమస్య (Presbyopia) ఉన్నవారికి ఇది గుడ్‌ న్యూస్‌. ఆ చుక్కల మందు ఎప్పుడు అందుబాటులోకి రానుంది తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్త కంటి చుక్కల మందు వచ్చేసింది. దీంతో కంటి అద్దాలు పెట్టుకునే అవసరం ఉండదు. మొబైల్‌ ఫోన్స్‌ చూడటం, పుస్తకాలు ఎక్కువగా చదివేవారు కన్న మసకగా కనిపిస్తుంది. దీంతో వారు కంటి అద్దాలు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కానీ, కొంతమందికి వయస్సురీత్యా కంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి వారి కోసం ముంబైకి చెందిన ఎంటోడ్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఒక కొత్త కంటి చుక్కల మందును అభివృద్ధి చేసింది. దాని పేరు ప్రెస్‌వూ ఐ డ్రాప్స్‌ (Presu Eye Drops). ప్రెస్‌బయోపియా సమస్యతో ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 1.09-1.80 బిలియన్ల మంది బాధపడుతుంటారు.


ఈ ప్రిస్‌బయోపియా వయస్సు రీత్యా వస్తుంది. ఏ వస్తువు అయినా క్షుణ్నంగా చూస్తేనే కనిపిస్తుంది. కేవలం దగ్గరగా ఉన్న వస్తువులను మాత్రమే  చూడగలుగుతారు. ముఖ్యంగా 40 వయస్సు వచ్చినవారికి ఈ సమస్య ప్రారంభమవుతుంది. రానురాను ఈ పరిస్థితులు దారుణంగా మారతాయి. అలాగే వదిలేస్తే 60 వయస్సు వచ్చేసరికి పూర్తిగా కనిపించకుండా పోతుంది. ఎంటోడ్‌ ఫార్మాస్యూటికల్‌  ఈ చుక్కల మందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI), సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (CSCO), సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట కమిటీ (SEC) సిఫార్సు మేరకు తాజాగా డీసీజీఐ ఈ చుక్కల మందుకు అనుమతులు లభించాయి.


ఇదీ చదవండి: ఈ మాస్క్‌ వేస్తే పెచ్చులు పెచ్చులుగా ఉన్న చుండ్రు కూడా రాలిపోవాల్సిందే..


ఈ ప్రెస్‌వూ కంటి చుక్కల మందు ప్రెస్‌బయోపియా కోసం అభివృద్ధి చేసిన మొదటి మందు. దీంతో కంటి అద్దాల అవసరం ఉండదు. ఇది వయస్సురీత్యా వచ్చే కంటి జబ్బు ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారిలో ఈ ప్రెస్‌బయోపియా వ్యాధి వస్తుంది. దీనివల్ల దూరంగా ఉన్న వస్తువులు కనిపించవు కేవలం దగ్గరగా ఉన్నవి మాత్రమే కనిపిస్తాయి. ఈ మందు తయారీదారు ఇప్పటికే పేటెంట్‌ హక్కుల కోసం దరఖాస్తు చేసుకుంది. 


ఈ మందు అభివృద్ధిలో అత్యాధునిక బఫర్ టెక్నాలజీని వాడారు. ప్రెస్‌వూని ఎన్ని ఏళ్లైనా వాడొచ్చు. ఈ ప్రస్‌వూ కంటిచూపు అభివృద్ధి తోడ్పడుతుంది. ఎంటాడ్‌ ఫార్మాస్యూటికల్స్‌ సీఈఓ నిఖిల్‌ కే మసూర్కర్‌ ప్రెస్‌వూ ఎన్నో ఏళ్ల అంకితభావంతో చేసిన పరిశోధన, అభివృద్ధికి ఫలితం. ఇది కేవలం ఒక ఉత్పత్తి మాత్రమే కాదు ఇది ఎన్నో మిలియన్ల మంది దృష్టి స్వాతంత్య్రాన్ని అందిస్తుంది అన్నారు.


ఇదీ చదవండి:  ప్రెగ్నెన్సీ సమయంలో పొరపాటున కూడా ఈ 6 ఆహారాలు తినకూడదు..


డాక్టర్ ఆదిత్య సెథీ ప్రకారం ప్రెస్‌వూ చుక్కల మందు వాడిన 15 నిమిషాల్లోనే ప్రభావం చూపే ప్రత్యామ్నాయం అన్నారు. ఈ ప్రెస్‌ వూ కంటి చుక్కల మందు అక్టోబర్‌ మొదటి వారంరో డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ ఆధారంగా అన్ని ఫార్మసీల్లో అందుబాటులో ఉంటాయన్నారు. ఈ మందు ధర రూ.350. దీన్ని ప్రధాన ఉద్ధేశ్యం ముఖ్యంగా చత్వారం బారిన పడే 40-55 ఏళ్ల వ్యక్తులకు మెరుగైన కంటి చూపును అందిచడం.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter