PM Kisan 14th Installment Status Check: అన్నదాతల ఎదురుచూపులకు చెక్ పడింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 14వ విడత నిధులను నేడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. గురువారం దేశంలోని 8.5 కోట్ల మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.17000 కోట్లకు పైగా మొత్తాన్ని జమ చేసింది. రాజస్థాన్‌లోని సికార్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ఫండ్స్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. గత 9 ఏళ్లలో రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా అన్నదాతలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైతుల కోసం విత్తనాల నుంచి మార్కెటింగ్‌ వరకు అన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని ప్రధాని తెలిపారు. 1.25 లక్షల పీఎం కిసాన్‌ సమృద్ధి కేంద్రాలను జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో యూరియా ధరను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. మన దేశంలో రైతులకు యూరియా బస్తా 266 రూపాయలకు లభిస్తుండగా.. పాకిస్థాన్‌లో రూ.800, బంగ్లాదేశ్‌లో రూ.720, చైనాలో రూ.2100, అమెరికాలో 3000 రూపాయల వరకు ధర పలుకుతోందన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు మోదీ. నగరాల్లో అన్ని సౌకర్యాలను గ్రామాల్లో కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. 


పీఎం కిసాన్ లబ్ధిదారులు కచ్చితగా ఈకేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి. రైతులు తమ బ్యాంక్‌ ఖాతాలను ఆధార్‌తో లింక్ చేసింది ఉండాలి. ఆధార్‌లను తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. 14వ విడత డబ్బులు పొందడాని తప్పకుండా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇంకా ఈకేవైసీ చేయని లబ్ధిదారులు అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.inని సందర్శించి ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ)ని సంప్రదించవచ్చు. 


మీ పేరును ఇలా చెక్ చేసుకోండి


==> పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ‌ను సందర్శించండి 
==> రైట్ సైడ్‌లో ఉన్న 'లబ్దిదారుల జాబితా' ట్యాబ్‌పై క్లిక్ చేయండి 
==> డ్రాప్ డౌన్ నుంచి రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్టిక్, మండలం, గ్రామం వంటి వివరాలను ఎంచుకోండి 
==> తరువాత 'గెట్ రిపోర్ట్' ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
==> లబ్ధిదారుల జాబితా వివరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.


డబ్బులు పడ్డాయో లేదో ఇలా చూసుకోండి 


==> https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి
==> 'ఫార్మర్స్ కార్నర్' కింద బెనిఫిషియరీ స్టేటస్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి
==> మీ ఆధార్ నంబర్, ఖాతా నంబర్ లేదా మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేయండి
==> 'గెట్ స్టేటస్' ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
==> లబ్ధిదారుడి వివరాలను బట్టి స్టాటస్ వివరాలు వస్తాయి. 


Also Read: Telangana Rain Updates: అర్ధరాత్రి అభయారణ్యంలో 80 మంది పర్యాటకులు.. ఒక్క ఫోన్‌ కాల్‌తో..!  


Also Read: Revanth Reddy: విశ్వనగరమో.. విషాద నగరమో తేలిపోయింది.. వర్షాలపై మంత్రి కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook