Narendra Modi: ఉగ్రవాదం ప్రపంచానికి పెను సమస్యగా మారింది. ఆఫ్ఘనిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలు..ఉగ్రవాదం సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఉగ్రవాదంపై ఉమ్మడిపోరుకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచం ఎదుర్కొంటున్న పెను సవాళ్లలో ఉగ్రవాదం(Terrorism) అతి ముఖ్యమైనది. ఇటీవలికాలంలో ఉగ్రవాదం మరోసారి పెరుగుతోంది. ఆఫ్ఘన్‌లో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమని ప్రదానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఉగ్రవాద సమస్యపై ఆయన మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు ప్రాంతీయంగా శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో కొత్త ప్రభుత్వాన్ని గుర్తించే విషయంలో అంతర్జాతీయ సమాజం ఆలోచనాత్మకంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. సీమాంతర ఉగ్రవాదం, ఉగ్రవాద సంస్థలకు ఆర్ధిక సహకారాన్ని అడ్డుకునేందుకు ఎస్‌సీఓ సమిష్టిగా చర్యలు చేపట్టాలన్నారు. మధ్య ఆసియా సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉగ్రవాద శక్తులపై పోరాటానికి ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేయాలని ప్రధాని మోదీ తెలిపారు. ఒక దేశంపై మరొక దేశానికి విశ్వాసం లేకపోవడం వల్లనే భౌగోళికంగా అడ్డుగోడలు ఏర్పడుతున్నాయని ప్రధాని మోదీ(PM Modi)అభిప్రాయపడ్డారు. ఎస్‌సీఓవోలో కొత్తగా చేరిన సభ్యదేశం ఇరాన్‌కు మోదీ స్వాగతం పలికారు. అన్నిదేశాల ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని కోరారు. 


మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌లో(Afghanistan) తాలిబన్లు(Talibans)అధికారంలో రావడాన్ని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానించారు. దేశంలో మళ్లీ ఘర్షణలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజానిదేనన్నారు. ఉగ్రవాదులకు ఆప్ఘనిస్తాన్ ఆశ్రయం ఇవ్వదన్నారు. చైనానే తమకు నమ్మకమైన నేస్తమన్నారు. ఆఫ్ఘనిస్తాన్(Afghanistan)నుంచి విదేశీ బలగాలు వెళ్లిపోయిన తరువాత ఆ దేశంలో కొత్త చరిత్ర ప్రారంభమైందని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తెలిపారు. ఎస్‌సీవో సభ్యదేశాలు..ఆఫ్ఘనిస్తాన్‌కు అన్నివిధాలా సహకరించాలన్నారు. 


Also read: Short Dress : పొట్టి డ్రస్ వేసుకుందని పరీక్షకు అనుమతించలేదు! అసోంలో ఘటన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook