PM Modi: దేశాభివృద్ధికి ఉచిత హామీలు ప్రమాదకరం..యూపీలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!
PM Modi: ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
PM Modi: దేశాభివృద్ధికి ఉచిత హామీలు ప్రమాదకరమన్నారు ప్రధాని మోదీ. ఓట్ల కోసం ఇచ్చే ఉచిత హామీల పట్ల ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తోందని..దేశ భవిష్యత్‌ను నిర్మిస్తోందన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆయన పర్యటించారు. 296 కిలోమీటర్ల బుందేల్ ఖండ్ ఎక్స్‌ప్రెస్ రహదారిని ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రధాని వెంట సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు.
296 కిలోమీటర్ల బుందేల్ ఖండ్ ఎక్స్‌ప్రెస్ రహదారిని రూ.14850 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈహైవే వల్ల యూపీలోని 7 జిల్లాలకు వెళ్లేందుకు సులువు అవుతుంది. నాలుగు లైన్ల రోడ్డును ఆరు లైన్లకు విస్తరించారు. బుందేల్ ఖండ్ ఎక్స్‌ప్రెస్ రహదారి వల్ల చిత్రకూట్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి తక్కువ సమయంలో వెళ్లవచ్చని అధికారులు తెలిపారు. జలౌన్ జిల్లా ఒరాయ్ మండలం కైతేరిలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
బుందేల్ ఖండ్ ఎక్స్‌ప్రెస్ రహదారి వల్ల చిత్రకూట్ నుంచి ఢిల్లీకి ప్రయాణ సమయం తగ్గుతుంది. దీని వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు ప్రధాని మోదీ. సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో రాష్ట్రం దూసుకెళ్తోందన్నారు. యూపీలో శాంతిభద్రతలు సైతం బాగా మెరుగుపడ్డాయని గుర్తు చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.
Also read:Minister Ktr: రైతుల ఆదాయ వివరాలు చూపండి..కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైర్..!
Also read:CM Kcr: బీజేపీపై ఇక యుద్ధమే..టీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook