PM Kisan Beneficiary Status 2024: దేశంలో కోట్లాది మంది మంది రైతులకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Samman Nidhi Yojana) 16వ విడత కోసం నిరీక్షణ నేటితో ముగియనుంది. లబ్ధిదారుల అకౌంట్‌లలో 2 వేల రూపాయలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా జమ చేయనున్నారు. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా నుంచి ప్రధాని మోదీ పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులను విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు ఏడాదికి రూ.6 వేలు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఏడాదిలో ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు వాయిదాల్లో రూ.2 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటివరకు మొత్తం 15 విడతలుగా అందజేయగా.. బుధవారం 16వ విడల నిధులు అందజేయనుంది. చివరగా గతేడాది నవంబర్ 23న లబ్ధిదారుల ఖాతాలకు రూ.2 వేలు జమ చేసింది. 15వ విడతతో 9,01,73,669 మంది రైతులకు లబ్ధి చేకూరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: ITR Filing: ట్యాక్స్‌పేయర్స్‌కు బిగ్ అలర్ట్.. మీకు అలాంటి నోటీసు వచ్చిందా..?   


మీ పేరు ఇలా చెక్ చేసుకోండి. (PM Kisan Beneficiary Status)


==> Step-1: ముందుగా పీఎం కిసాన్ నిధి pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
==> Step-2: అనంతరం హోమ్‌పేజీలో 'ఫార్మర్ కార్నర్' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి
==> Step-3: 'బెనిఫిషియరీ స్టేటస్'పై క్లిక్ చేయండి.
==> Step-4: డ్రాప్-డౌన్ మెనుకి వెళ్లి రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్, గ్రామాన్ని ఎంచుకోండి.
==> Step-5: స్టాటస్ చెక్ చేసుకోవడానికి 'గెట్ రిపోర్ట్'పై క్లిక్ చేయండి.
==> Step-6: మీ గ్రామం పూర్తి జాబితా మీ ముందు ఉంటుంది. లిస్టులో మీరు పేరు ఉందో లేదో చూసుకోండి. 


స్టేటస్ ఇలా చెక్ చేయండి


==> Step-1: ఫార్మర్ కార్నర్‌లో నో యువర్ స్టేటస్‌పై క్లిక్ చేయండి
==> Step-2: ఇక్కడ మీకు కొత్త విండో ఓపెన్ అవుతుంది. మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయండి. క్యాప్చా కోడ్‌ను పూరించండి. 
==> Step-3: గెట్ OTPపై క్లిక్ చేయండి
==> Step-4: ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేసి స్టాటస్ చెక్ చేసుకోండి. 


మీకు రిజిస్ట్రేషన్ నంబర్ తెలియకపోతే.. అక్కడ ఉన్న నీలిరంగు బార్‌పై క్లిక్ చేయండి. మీ ఆధార్ నంబర్ లేదా లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్‌ను నమోదు చేసిన తరువాత రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొందండి. ఈ స్కీమ్‌కు సంబంధించిన ఏమైనా సందేహాలు, సమస్యలు ఉన్నా.. pmkisan-ict@gov.in కు ఈ-మెయిల్ చేయవచ్చు. లేదా 155261, 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092 నంబర్లలో కూడా సంప్రదించవచ్చు. పీఎం కిసాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ (కిసాన్ ఈ-మిత్ర) ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.


Also Read: FD Interest Rates: ఎఫ్‌డీలపై అత్యధికంగా 9.50 శాతం వరకూ వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి