Private players can buy coaches : రైళ్ల బోగీలను కొనుక్కోవడానికి, లీజుకు తీసుకోవడానికి అవకాశం
Private firms can buy coaches : రైల్వేశాఖ త్వరలో రైల్వే బోగీలను అద్దెకు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఆసక్తి ఉన్నవాళ్లు.. రైల్వే బోగీలను లీజుకు తీసుకొని.. వాటిని తమ ఆసక్తికి అనుగుణంగా తీర్చిదిద్దుకోవచ్చు.
Private firms can buy coaches, run tourist circuit trains : ఇప్పటి వరకు రైళ్లను లీజుకు ఇచ్చిన రైల్వేశాఖ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. రైల్వేశాఖ త్వరలో రైల్వే బోగీలను (railway coaches) అద్దెకు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఆసక్తి ఉన్నవాళ్లు.. రైల్వే బోగీలను లీజుకు తీసుకొని.. వాటిని తమ ఆసక్తికి అనుగుణంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇలాంటి కొత్త పద్ధతికి స్వాగతం పలికేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది.
నచ్చిన రీతిలో బోగీలను తీర్చిదిద్దనుంది
ఈ కొత్త విధానం ప్రకారం రైల్వేశాఖ ఆసక్తిగల లీజుదారులకు, వారికి నచ్చిన రీతిలో బోగీలను తీర్చిదిద్ది అద్దెకు ఇవ్వనుంది. లేదంటే శాశ్వతంగా కొనుగోలు చేసేందుకు కూడా రైల్వేశాఖ అవకాశం కల్పించింది. సాధారణంగా బోగీ లీజు కాలపరిమితి కనీసం 5 సంవత్సరాలు. తర్వాత ఆ లీజును జీవితకాలం వరకు పొడిగించుకునే అవకాశం కల్పించింది రైల్వేశాఖ.
Also Read : Bhupendra patel: గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్
ఇక రూట్లు, టారిఫ్ నిర్ణయాధికారం లీజుకు తీసుకున్న వారికే ఉంటుంది. ఈ బోగీలను సాంస్కృతిక, మతపరమైన, ఇతర పర్యాటక సర్క్యూట్ రైళ్లుగా నడపొచ్చని రైల్వేశాఖ తెలిపింది. ఇక ఆసక్తి ఉన్న ప్రైవేట్ పార్టీలంతా (private parties) రైల్వేశాఖకు (railway department) అప్లై చేసుకుంటే రైల్వే బోగినీ సొంతం చేసుకోవచ్చు లేదంటే లీజుకు తీసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook