భారతీయ రైల్వేలో తొలిసారిగా ప్రైవేటు కూత విన్పించనుంది. మరో రెండేళ్లలో పట్టాలపై ప్రైవేటు రైళ్లు పరుగెట్టనున్నాయి. దేశవ్యాప్తంగా ప్రైవేటుపరం కానున్న 151 రైళ్లలో తెలుగు రాష్ట్రాల పరిధిలో ఉన్న రైళ్లు వివరాలు ఇవీ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇండియన్ రైల్వేస్ ( Indian Railways ) చరిత్రలో కొత్త అధ్యాయం రానుంది 2023 మార్చ్ నాటికి దేశంలో ప్రైవేటు రైళ్లు ( Private Rails ) కన్పించనున్నాయి తేజస్ ( Tejas ) వంటి స్పెషల్ కేటగిరి రైలును ప్రైవేటు సంస్థల ఆధ్వర్యాన నడిపించనున్నారు. పాసెంజర్ రైలు ఇకపై ప్రైవేటు రైలుగా పట్టాలపై పరుగెట్టనుంది. దేశవ్యాప్తంగా దీనికోసం 151 రైళ్లను సిద్ధం చేశారు. ఈ 151 రైళ్లలో తెలుగు రాష్ట్రాల పరిధిలో ఉన్న రైళ్ల వివరాలివీ..


సికింద్రాబాద్ క్లస్టర్ ( Secunderabad Cluster )పేరుతో దక్షిణ మధ్య రైల్వే ( South central railway ) పరిధిలో 11 రూట్లలో ప్రైవేటు రైళ్లు నడవనున్నాయి.  దీనికోసం రైల్వే శాఖ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ముందు దేశవ్యాప్తంగా 12 మార్గాల్లో  ప్రైవేటుకు పచ్చజెండా ఉపి.దశలవారీగా మిగిలిన రూట్లలో నడపడానికి సిద్ధమౌతోంది ఇండియన్ రైల్వేస్. 


తెలుగు రాష్ట్రాల పరిధిలో..


సికింద్రాబాద్ - శ్రీకాకుళం వయా విశాఖపట్నం, సికింద్రాబాద్ - తిరుపతి, గుంటూరు - సికింద్రాబాద్, గుంటూరు- కర్నూలు సిటీ, తిరుపతి - వారణాసి వయా సికింద్రాబాద్,  సికింద్రాబాద్ - ముంబైా, ముంబై - ఔరంగాబాద్, విశాఖపట్నం- విజయవాడ, విశాఖపట్నం - బెంగుళుూరు వయా రేణిగుంట, హౌరా-సికింద్రాబాద్, సికింద్రాబాద్- పాండిచ్చేరి వయా చెన్నై


ఈ ఏడాది జూలైలో ప్రైవేటీకరణ కోసం రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ దరఖాస్తుల్ని ఆహ్వానించగా..దేశవ్యాప్తంగా 16 రూట్లకు 120 దరఖాస్తులు చేరాయి. ఇందులో 102 దరఖాస్తుల్ని అర్హమైనవిగా పరిగణించారు.  సికింద్రాబాద్ క్లస్టర్ పరిధిలో 9 దరఖాస్తులు అర్హత సాధించాయి. తరువాతి దశలో ఫైనాన్షియల్ బిడ్స్ ఆహ్వానించనున్నారు. ప్రైవేట్ ద్వారా దేశవ్యాప్తంగా 30 వేల కోట్లు సమకూర్చుకోవాలన్నది రైల్వే ఆలోచన. ఎక్కువ కోట్ చేసిన సంస్థకు ప్రైవేట్ రైళ్లు నిర్వహణ కాంట్రాక్ట్ దక్కనుంది. Also read: Tarun Gogoi: అస్సాం మాజీ ముఖ్యమంత్రి గొగోయ్ పరిస్థితి విషమం


టెండర్లకు అర్హత పొందిన సంస్థలివే…


1. క్యూబ్‌ హైవేస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్ లిమిటెడ్  2. గేట్‌వే రైల్‌ ప్రైవేట్ లిమిటెడ్, గేట్‌వే డిస్ట్రిపార్క్స్‌ లిమిటెడ్‌   కన్సార్షియం 3. జీఎమ్మార్‌ హైవేస్‌ లిమిటెడ్ 4. ఐఆర్‌సీటీసీ ( IRCTC ) 5. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్స్‌ లిమిటెడ్ 6. ఎల్‌ అండ్‌ టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్ 7. మాలెంపాటి పవర్‌ ప్రైవేట్ లిమిటెడ్, టెక్నో ఇన్‌ఫ్రా డెవెలపర్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్టియం 8. మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెండ్ 9. వెల్‌స్పన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌. ప్రస్తుతం నడుస్తున్న సర్వీసుల్నించే కొన్నింటిని ప్రైవేటు సంస్థలకు కేటాయించనున్నారు. ప్రైవేటు సంస్థలు సొంతంగా రైల్‌ రేక్స్‌ సమకూర్చుకుని నడపనున్నాయి.


ప్రైవేటు సొంత ఛార్జీలు..


ప్రైవేటు సంస్థలు తాము నడిపే రైళ్లకు సొంతంగా చార్జీలు నిర్ణయించుకుంటాయి. రైల్వే అనుమతించిన మేర..వసూలు చేసుకుంటాయి. ఆధునిక బోగీలు, వసతులు, వేగం, పరిశుభ్రత, భోజనం నాణ్యత ఆధారంగా ఛార్జీలు ఉంటాయి. కచ్చితంగా ప్రస్తుత రైలు చార్జీల కంటే ఎక్కువగా ఉండనున్నాయి. విదేశాల నుంచి కూడా లోకోమోటివ్‌ ఇంజన్లు, బోగీలు దిగుమతి చేసుకునే వెసులుబాటు ఉండటంతో కొత్త తరహా రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టే అవకాశాలున్నాయి. అయితే స్టేషన్లు, సిగ్నళ్లు అన్నీ రైల్వే అధీనంలోనే ఉంటాయి. ఆ స్టేషన్లను, విద్యుత్ వినియోగించుకున్నందుకు రైల్వై ( Railways )కు ప్రత్యేక ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. Also read: Bollywood Drugs Case: హాస్యనటి భర్త సైతం అరెస్ట్