ఈ అబ్బాయిని గుర్తు పట్టారా..?
ఢిల్లీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు దాదాపు 20 శాతం పోలింగ్ నమోదైంది. దీన్నిబట్టి చూస్తే . . పోలింగ్ కాస్త మందకొడిగానే సాగుతున్నట్లు తెలుస్తోంది. ఐతే ఉదయం పూట.. చలి వాతావరణం ఉండడంతో . . ఓటర్లు పోలింగ్ బూత్ లకు పెద్ద ఎత్తున రాలేదు.
ఢిల్లీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు దాదాపు 20 శాతం పోలింగ్ నమోదైంది. దీన్నిబట్టి చూస్తే . . పోలింగ్ కాస్త మందకొడిగానే సాగుతున్నట్లు తెలుస్తోంది. ఐతే ఉదయం పూట.. చలి వాతావరణం ఉండడంతో . . ఓటర్లు పోలింగ్ బూత్ లకు పెద్ద ఎత్తున రాలేదు. మధ్యాహ్నం పోలింగ్ కాస్త పెరిగినట్లుగానే తెలుస్తోంది.
మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో కొత్త ఓటర్లు సైతం ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. యువత పెద్ద సంఖ్యలో వచ్చి తమ మొదటి ఓటును సద్వినియోగం చేసుకోవడం కనిపించింది. అలాగే లోధీ ఎస్టేట్ లో ఓ యువకుడు ఓటు హక్కు వినియోగించుకున్నాడు. కానీ అతని చుట్టూ భారీ బందోబస్తు కనిపించింది. దీంతో 'ఈ అబ్బాయి ఎవరో ..' అనే చర్చ జరిగింది. ఐతే ఆ అబ్బాయి ఎవరో కాదు. . కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ మనవడు. ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా పుత్రుడు. అతని పేరు రైహాన్ రాజీవ్ వాద్రా. అతడు తొలిసారిగా ఢిల్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నాడు. లోధీ ఎస్టేట్ లోని బూత్ నంబర్ 114లో ఓటు వేశాడు.
[[{"fid":"181814","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత రైహాన్ వాద్రా మీడియాతో మాట్లాడాడు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరాడు. అంతే కాదు .. ఢిల్లీలో ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నాడు. ముఖ్యంగా విద్యార్థులకు ప్రజా రవాణా వ్యవస్థ ఉచితంగా లభించాలని కోరాడు.